Bengal Gram : శనగలో తెగుళ్ళు, చీడపీడల నివారణ

ఎండు తెగులు సోకిన మెక్కలు తొలి దశలో తర్వగా చనిపోతాయి. కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి.

Bengal Gram : శనగలో తెగుళ్ళు, చీడపీడల నివారణ

Bengal Gram (1)

Updated On : March 11, 2022 / 11:51 AM IST

Bengal Gram : మన రాష్టంలో రబీ కాలం లో పండించే ఆపరాలలో శనగ ప్రధానమైనది. శీతా కాలంలో కేవలం మంచు తో పెరిగె శనగ పంటను తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలలో సాగుచేస్తున్నారు. అధిక దిగుబడి నివ్వడం వల్ల ఈ పంట విస్తీర్ణం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.

ఈ పంట నల్ల రేగడి భూముల్లో సాగుచేయబడుతుంది . రాష్టంలో శనగ విస్తీర్ణం సుమారుగా 8.0 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం. నల్లరేగడి నెలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటు శీతకాలంలో మంచుతో మెక్కలు పెరుగుతాయి.

శనగలో తెగుళ్లు, చీడపీడల నివారణ;

ఎండు తెగులు: ఎండు తెగులు సోకిన మెక్కలు తొలి దశలో తర్వగా చనిపోతాయి. కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి. ఐ.సి.సి.సి.-37 ,ఐ.సి.సి.వి-2 ,ఐ.సి.సి.వి-10 రకాలను వరుసగా 3-4 సం.లు ఒకే పొలంలో విత్తుకోకుడదు. పంట మార్పిడి,విత్తనశుద్ది చేయాలి. ఎండు తెగులు , వేరుకుళ్ళు తెగులు , మొదలు కుళ్లు తెగులు నివారణకు 2.5 గ్రాముల కార్బండిజిమ్ లేదా విటావాక్స్ పవర్ 1.5గ్రాములు లేదా 1.5గ్రాముల టెబుకోనజోల్ కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి. తరువాత విత్తనానికి ట్రైకోడర్మావిరిడి పొడి మందును 8 నుండి 10గ్రాముల కలిపి విత్తుకోవడం వలన ఈ శిలీంధ్రం భూమిలో బాగా వ్యాప్తి చెంది తెగుళ్ళ బారి నుండి పంటను రక్షిస్తుంది.

శనగపచ్చ పురుగు : ఇది లద్దే పురుగు దశలో పూతను ,కాయలను తింటూ ఉంటుంది .సీతాకోక చిలక దశలో పూత పైన ,కాయలపైన గ్రుడ్లును ఒక్కోకటిగా పెడుతుంది .గ్రుడ్ల నుండి వచ్చిన పురుగు కాయలను తొలిచి గింజలను తింటుంది .నివారణకు లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2.౦ మి.లీ. లేక క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.0గ్రా .చొప్పున పూత ,పిందె దశల్లో 10 రోజుల వ్యవధిలో మందులను మర్చి రెండు ,మూడు సార్లు పిచికారి చేయాలి. శనగతో అంతరపంటలుగా ఆవాలు వేసుకోవాలి.