Home » BJP president Purandeswari
దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు గురించి పుస్తకం రాశారని దానిని చదివి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుడని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆమంచి ప్రశ్నించారు.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా ఇప్పుడు టీడీపీ సేవలో తరిస్తోందని ఎద్దేవా చేశారు.
ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చారని విమర్శించారు.