Vijayasai Reddy : పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన యామినీ శర్మ

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా ఇప్పుడు టీడీపీ సేవలో తరిస్తోందని ఎద్దేవా చేశారు.

Vijayasai Reddy : పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన యామినీ శర్మ

Vijayasai Reddy Criticism Purandeswari

Updated On : November 6, 2023 / 5:27 PM IST

Vijayasai Reddy Criticism Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందన్నారు. తన తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా అని విమర్శించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి పేరుకు మాత్రమే బీజేపీ అధ్యక్షురాలని, ఇప్పుడు ఆమె టీడీపీ సేవలో తరిస్తోందని ఎద్దేవా చేశారు.

ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరావు.. చంద్రబాబుకు కత్తి అందించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వెంట లేకున్నా అంతా తన వైపే వచ్చారని చంద్రబాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తైతే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘన చరిత్ర పురంధేశ్వరిదని అని అన్నారు.

Bus Accident : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో చంద్రబాబు ఇంటికి వెళ్తే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకే మోస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘అన్న టీడీపీ’ అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించారని తెలిపారు. పురంధేశ్వరే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలుగా కూడా పని చేశారని చెప్పారు. ‘అన్న టీడీపీ’ ఓడిపోవడంతో కాంగ్రెస్ లో చేరిన పురంధేశ్వరి.. సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తారని పేర్కొన్నారు.

అందుకే పురంధేశ్వరిపై విమర్శలు : యామనీ శర్మ

పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామనీ శర్మ కౌంటర్ ఇచ్చారు. జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు ఒక మహిళా అధ్యక్షురాలిగా ఉండటాన్ని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని యామనీ శర్మ పేర్కొన్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Vijayawada Bus Accident : విజయవాడ బస్సు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ ఏం చెప్పాడంటే?

జగన్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నందుకే పురంధేశ్వరిపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్లు బెయిల్ పై  తిరుగుతున్న విజయసాయిరెడ్డి.. కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

పురంధేశ్వరి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అదిరేవారెవరూ బీజేపీలో లేరని తేల్చి చెప్పారు. వైసీపీ అరాచకాలు, అక్రమాలను కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడుతామన్నారు.