Vijayawada Bus Accident : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Vijayawada Bus Accident : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

Vijayawada RTC Bus Accident

Updated On : November 6, 2023 / 4:46 PM IST

Vijayawada Bus Accident : విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకు వెళ్లింది.

దీంతో  పలువురు ప్రయాణికులు బస్సు చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొంతమందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు ఆసుపత్రికి తరలించారు.

Bus Accident : రైల్వే ట్రాక్‌పై నుంచి పడిన బస్సు…నలుగురి మృతి, 28 మందికి గాయాలు

బస్సు కింద పలువురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో కండక్టర్ వీరయ్య, మహిళా ప్రయాణికురాలు, ఓ చిన్నారి ఉన్నారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి అనే మహిళ, ఆమె మనవడుగా గుర్తించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ

బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరం : ఆర్టీసీ ఆర్ఎం
బస్సు ఫ్లాట్ ఫాం మీదకి దూసుకొచ్చిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని ఆర్టీసీ ఆర్ఎం ఎం. ఏసుదానం అన్నారు. ఈ మేరకు ఆయన 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. గుంటూరు వెళ్లేందుకు బస్సు లోకి ప్రయాణికులను ఎక్కించారని తెలిపారు. బస్సు బయలుదేరేందుకు డ్రైవర్ రివర్స్ గేర్ వేశారని చెప్పారు.

Road Accident : డ్రంకెన్ డ్రైవ్ నిండు ప్రాణం తీసింది.. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్

గేర్ సరిగ్గా పడకపోవడంతో బస్సు ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిందన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. శాఖాపరమైన దర్యాప్తు చేశాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.