Home » Bus rammed platform
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.