Vijayawada Bus Accident : విజయవాడ బస్సు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ ఏం చెప్పాడంటే?

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.

Vijayawada Bus Accident : విజయవాడ బస్సు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ ఏం చెప్పాడంటే?

Vijayawada Bus Accident (1)

Updated On : November 6, 2023 / 4:53 PM IST

Vijayawada Bus Accident : విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ బస్సు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. రివర్స్ గేర్ పడకపోవడం వల్లే బస్సు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రివర్స్ గేర్ పడకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు బస్సు డ్రైవర్ తెలిపారు. రివర్స్ గేర్ వేశానని, కానీ అది పడలేదని చెప్పారు. రివర్స్ గేర్ పడిందనుకుని బస్సును మూవ్ చేశానని తెలిపారు. కొంచె ఎక్స్ లేటర్ ఇచ్చానని, బస్సు ముందుకెళ్లి పోయిందని ప్రమాదం జరిగిన తీరును బస్సు డ్రైవర్ వివరించారు.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో పలువురు ప్రయాణికులు బస్సు చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

CM Jagan : విజయవాడ బస్టాండ్ ఘటనపై సీఎం జగన్ దిగ్ర్భాంతి .. విచారణకు ఆదేశం

రివర్స్ గేర్ కు బదులు ముందుకు గేర్ వేయడంతో ప్రమాదం..

ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల్లో కండక్టర్ వీరయ్య, మహిళా ప్రయాణికురాలు, ఓ చిన్నారి ఉన్నారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి అనే మహిళ, ఆమె మనవడుగా గుర్తించారు. విజయవాడ బస్టాండ్ లో రివర్స్ గేర్ కు బదులు ముందుకు గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెబుతున్నారు. ఇంతకీ ఘటన ఎలా జరిగింది? డ్రైవర్ నిర్లక్ష్యమా, సాంకేతిక లోపమా? అనేది తెలియాల్సివుంది.

బస్సు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర విచారం..

మరోవైపు విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అంతకముందు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Dwaraka Tirumala Rao : విజయవాడ బస్టాండ్ ప్రమాద ఘటన… మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం : ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం : ఆర్టీసీ ఎండీ

చనిపోయిన ముగ్గురి మృతుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. గాయపడిన వారికి వైద్యానికి అయ్యే ఖర్చులను భరిస్తామని తెలిపారు. బీభత్సం సృష్టించిన బస్సు ఆటో నగర్ డిపోకు సంబంధించిన ఏసీ బస్ గా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కుమారి ప్యాసింజర్, కండెక్టర్ వీరయ్య స్పాట్ లో చనిపోయారని, అయాన్ష్ అనే చిన్నారి చికిత్స పొందుతూ హాస్పిటల్ లోనే చనిపోయారని పేర్కొన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలపై సాయంకాలం లోపు పూర్తి సమాచారం లభిస్తుందన్నారు. ప్రమాద సమయంలో బస్ లో 34 మంది ప్యాసింజర్లు ఉన్నారని వివరించారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్ స్టేషన్ లో ప్రమాదం జరుగడం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. డ్రైవర్ కు 61 సంవత్సరాలు ఉన్నాయని వెల్లడించారు.

Bus Accident : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా?..

ఆల్కాహాల్ తీసుకోలేదని, తాము రెగ్యులర్ చెకింగ్ చేస్తామని తెలిపారు. సర్వీసును 60 సంవత్సరాలకు పెంచినప్పుడే డ్రైవర్ తాను డ్రైవింగ్ చేసే సామర్థ్యానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి పంపించామని పేర్కొన్నారు. ఆటోనగర్ కు‌ చెందిన బస్సులో గుంటూరుకు వెళ్లేందుకు 24 మందిని ఎక్కించుకుందన్నారని తలిపారు. రివర్స్ చేసే క్రమంలో బస్సు ప్లాట్ ఫాం పైకి దూసుకెళ్లిందన్నారు.

సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. బస్సు గేర్ సరిగా పడలేదని చెబుతున్నారని వెల్లడించారు. సాయంత్రానికి వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బస్టాండులో జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. డ్రైవర్ ఇటీవలే సిక్ లో ఉన్నారని, కోలుకుని విధులకు వచ్చాడని పేర్కొన్నారు.

Vijayawada Highway: విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్.. కార్లు ధ్వంసం

బస్సు కండీషన్ బాగానే ఉందన్న ఎండీ..

రెగ్యులర్ గా ఆల్కహాల్ టెస్ట్ చేశాకే డ్రైవర్ కు బస్సు అప్పగిస్తామని తెలిపారు. తనకున్న సమాచారం ప్రకారం బస్సు కండీషన్ బాగానే ఉందని, నిపుణుల నివేదికను బట్టి ఎవరి తప్పో తేలుతుందన్నారు. వయసు రిత్యా కొన్ని బస్సులను కొందరికే నడిపేలా డ్యూటీ వేస్తామని చెప్పారు.  ఫిట్ నెస్ లేకుండా బస్సులు నడుపుతున్నామనేది కరెక్ట్ కాదని తెలిపారు.

బస్సు కండీషన్ కూడా పరిశీలించి రూట్లను నిర్ధారిస్తామన్నారు. కచ్చితంగా ఈ ప్రమాదం పొరబాటున జరిగిందన్నారు. కారణాలు తెలిశాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటనతో ప్రజలు భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. నెలకు మూడు వందల బస్సులు నవంబర్ నుంచి కొత్తగా వస్తున్నాయని తెలిపారు.