CM Jagan : విజయవాడ బస్టాండ్ ఘటనపై సీఎం జగన్ దిగ్ర్భాంతి .. విచారణకు ఆదేశం
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాల్ని బలి తీసుకుంది. బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా బస్సు చక్రాల కింద పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

CM Jagan
CM Jagan reaction On Vijayawada bus stand incident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సోమవారం బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాల్ని బలి తీసుకుంది. బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా బస్సు చక్రాల కింద పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతిని వ్యక్తంచేశారు. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకు వెళ్లిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేసిన పూర్తి వివరాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.
ఈ ఘటనలో కండక్టర్ వీరయ్యతోపాటు..ఓ మహిళా ప్రయాణికురాలు, ఓ చిన్నారి ఉన్నారని గుర్తించారు. అనూహ్యంగా జరిగిన ఈ విషాద ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం గేర్ సరిగ్గా పడకపోవడంతో బస్సు ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిందని భావిస్తున్నారు.దీనిపై పూర్తి విచారణకు సీఎం జగన్ ఆదేశించటంలో అధికారులు ఆ పనిలో పడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు ఆర్టీసీ కార్పొరేషన్ తరపున రూ. 5 లక్షలు పరిహారంగా అందిస్తామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.