Dwaraka Tirumala Rao : విజయవాడ బస్టాండ్ ప్రమాద ఘటన… మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం : ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

బస్ స్టేషన్ లో ప్రమాదం జరగడం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Dwaraka Tirumala Rao : విజయవాడ బస్టాండ్ ప్రమాద ఘటన… మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం : ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

APSRTC MD Dwaraka Tirumala Rao

Updated On : November 6, 2023 / 12:28 PM IST

RTC MD Dwaraka Tirumala Rao : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు ప్లాట్ పామ్ పై నిల్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీభత్స సృష్టించిన బస్సు ఆటో నగర్ డిపో కు సంబంధించిన ఏసీ బస్ అని తెలిపారు. ఈ ప్రమాదంలో కుమారి ప్యాసింజర్, ఔట్ సోర్సింగ్ కండక్టర్ వీరయ్య స్పాట్ లో చనిపోయారని, చికిత్స పొందుతూ చిన్నారి మరణించారని తెలిపారు.

అయాన్ష్ అనే చిన్నారి చికిత్స పొందుతూ హాస్పిటల్ లో చనిపోయారని పేర్కొన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చనిపోయిన ముగ్గురి కుటుంబ సభ్యులకు ఆర్టీసీ కార్పొరేషన్ తరపున రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. అలాగే గాయపడినివారి వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపారు. ప్రమాద సమయంలో బస్ లో 34 మంది ప్యాసింజర్లు ఉన్నారని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై సాయంకాలం లోపు పూర్తి సమాచారం లభిస్తుందన్నారు.

Bus Accident : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  బస్ స్టేషన్ లో ప్రమాదం జరుగడం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. డ్రైవర్ కు 61 సంవత్సరాలు ఉన్నాయని వెల్లడించారు. ఆల్కాహాల్ తీసుకోలేదని, తాము రెగ్యులర్ చెకింగ్ చేస్తామని తెలిపారు. సర్వీసును 60 సంవత్సరాలకు పెంచినప్పుడే డ్రైవర్ తాను డ్రైవింగ్ చేసే సామర్థ్యానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి పంపించామని పేర్కొన్నారు. ఇప్పుడు 62 సంవత్సరాల వయసు పెంచారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుందన్నారు.

బస్ కండీషన్, అది ఎన్ని కిలోమీటర్లు తిరగిందన్నది చూడాలని అన్నారు. ఆటోనగర్ కు‌ చెందిన బస్సులో గుంటూరుకు వెళ్లేందుకు 24 మందిని ఎక్కించుకుందన్నారని తలిపారు. రివర్స్ చేసే క్రమంలో బస్సు ప్లాట్ ఫాం పైకి దూసుకెళ్లిందన్నారు. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. బస్సు గేర్ సరిగా పడలేదని చెబుతున్నారని వెల్లడించారు. సాయంత్రానికి వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Chetak Helicopter Crash: కేరళలో పెను ప్రమాదం.. కొచ్చిలో నేవీ హెలికాప్టర్ కూలి ఒకరు మృతి

బస్సులు కంట్రోల్ స్పీడ్ లో వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బస్టాండు సమీప ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని వెల్లడించారు. డ్రైవర్ ఇటీవలే సిక్ లో ఉన్నారని, కోలుకుని విధులకు వచ్చాడని పేర్కొన్నారు. రెగ్యులర్ గా ఆల్కహాల్ టెస్ట్ చేశాకే డ్రైవర్ కు బస్సు అప్పగిస్తామని తెలిపారు. డ్రైవర్ లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం కాబట్టే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చెబుతున్నామని తెలిపారు. తనకున్న సమాచారం ప్రకారం బస్సు కండీషన్ బాగానే ఉందని, నిపుణుల నివేదికను బట్టి ఎవరి తప్పో తేలుతుందన్నారు.

వయసు రిత్యా కొన్ని బస్సులను కొందరికే నడిపేలా డ్యూటీ వేస్తామని చెప్పారు. ఫిట్ నెస్ లేకుండా బస్సులు నడుపుతున్నామనేది కరెక్ట్ కాదని తెలిపారు. బస్సు కండీషన్ కూడా పరిశీలించి రూట్లను నిర్ధారిస్తామన్నారు. కచ్చితంగా ఈ ప్రమాదం పొరబాటున జరిగిందన్నారు. కారణాలు తెలిశాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటనతో ప్రజలు భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. నెలకు మూడు వందల బస్సులు నవంబర్ నుంచి కొత్తగా వస్తున్నాయని తెలిపారు.

Maharashtra Bus Accident: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం.. కాల్వలో పడటంతో 13 మంది మృతి

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు కింద పలువురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల్లో కండక్టర్ వీరయ్య, ప్రయాణికురాలు కుమారి, ఆమె మనువరాలున్నట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.