Bus Accident : రైల్వే ట్రాక్‌పై నుంచి పడిన బస్సు…నలుగురి మృతి, 28 మందికి గాయాలు

రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్‌పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు...

Bus Accident : రైల్వే ట్రాక్‌పై నుంచి పడిన బస్సు…నలుగురి మృతి, 28 మందికి గాయాలు

Bus falls on railway track

Updated On : November 6, 2023 / 7:13 AM IST

Bus Accident : రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్‌పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు.దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినపుడు ఈ బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

Also Read : Ram Temple : అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠాపన వేడుకలు…ప్రతీ ఇంటికి అక్షింతల పంపిణీకి ఏర్పాట్లు

ఈ ప్రమాదంలో 28 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. బస్సు ప్రమాద స్థలాన్ని దౌసా అదనపు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కస్వా పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : School Principal Arrest : పాఠశాలలో 50 మంది బాలికలపై లైంగిక వేధింపులు…కీచక ప్రిన్సిపాల్ అరెస్ట్