Ram Temple : అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠాపన వేడుకలు…ప్రతీ ఇంటికి అక్షింతల పంపిణీకి ఏర్పాట్లు

దేశంలోని హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలు వచ్చే ఏడాది జనవరి నెలలో భక్తుల కోసం తెరచుకోనున్నాయి. జనవరి నెలలో రామాలయ ప్రతిష్ఠాపన వేడుకకు ముందు ఆదివారం అక్షత పూజతో ఆచారాలు ప్రారంభమయ్యాయి....

Ram Temple : అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠాపన వేడుకలు…ప్రతీ ఇంటికి అక్షింతల పంపిణీకి ఏర్పాట్లు

Ram Temple

Updated On : November 6, 2023 / 9:12 AM IST

Ram Temple : దేశంలోని హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలు వచ్చే ఏడాది జనవరి నెలలో భక్తుల కోసం తెరచుకోనున్నాయి. జనవరి నెలలో రామాలయ ప్రతిష్ఠాపన వేడుకకు ముందు ఆదివారం అక్షత పూజతో ఆచారాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల ప్రారంభంతో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పనులు ముమ్మరం చేశారు. అయోధ్యలోని ఆలయంలో 100 క్వింటాళ్ల బియ్యంతో పసుపు,దేశీ నెయ్యి కలిపి అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

Also Read : School Principal Arrest : పాఠశాలలో 50 మంది బాలికలపై లైంగిక వేధింపులు…కీచక ప్రిన్సిపాల్ అరెస్ట్

దేశంలోని 45 సంస్థాగత ప్రావిన్సుల నుంచి అయోధ్యకు చేరుకున్న విశ్వ హిందూ పరిషత్ లోని 90 మంది,ఆర్ఎస్ఎస్ సభ్యులకు ఈ పూజిత్ అక్షత్ పంపిణీ చేయనున్నారు. ఈ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు జనవరి 22వతేదీ లోపు ముడుపుల వేడుకకు ముందు దేశవ్యాప్తంగా బియ్యాన్ని పంపిణీ చేస్తారని ట్రస్ట్ తెలిపింది.

Also Read : Work from home : ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్…50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం

ఈ అక్షింతలను పంపిణీ చేయడం ద్వారా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. ఈ అక్షింతలను జనవరి 1 నుంచి 15వతేదీల మధ్య కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా కార్యకర్తలు హిందువుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు.

Also Read : Team Indias win : దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా విజయం… యూపీ వధూవరుల సంబరాలు