Girl students : పరీక్షలు రాసేందుకు వచ్చిన మహిళల మంగళ సూత్రాలు తొలగించారు…
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు వారి మంగళసూత్రాలను తీసివేయాలని పరీక్ష అధికారులు కోరడం వివాదాన్ని రేకెత్తించింది....

Girl students mangalsutra
Girl students : పరీక్షలు రాసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థినుల మంగళ సూత్రాలు తొలగించిన అధికారుల నిర్వాకం కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు వారి మంగళసూత్రాలను తీసివేయాలని పరీక్ష అధికారులు కోరడం వివాదాన్ని రేకెత్తించింది. మంగళసూత్రం కాకుండా, మహిళల చెవిపోగులు, గొలుసులు, కాలి మెట్టెలు,చేతి ఉంగరాలతో సహా వారి ఆభరణాలను కూడా తీసివేయాలని పరీక్ష అధికారులు కోరారు.
Also Read : Work from home : ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్…50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం
ఈ పరిణామంపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే బసంగౌడ యత్నాల్ తీవ్రంగా స్పందించారు. మహిళా అభ్యర్థుల మంగళసూత్రాల తొలగింపు చర్య కేవలం హిందువుల కోసమేనా అని బసంగౌడ ప్రశ్నించారు. అంతేకాకుండా హిజాబ్ ధరించిన మహిళలను కూడా అధికారులు తనిఖీ చేశారని, అయితే వారిని లోపలికి అనుమతించారని ఆయన పేర్కొన్నారు.
Also Read : Team Indias win : దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా విజయం… యూపీ వధూవరుల సంబరాలు
‘‘హిందూ సంస్కృతిలో భాగంగా పరీక్షలు రాసేటపుడు మహిళలు మంగళసూత్రాన్ని తీసివేయాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు మేం వాటిని తీసివేస్తాం. నేను నా మంగళసూత్రాన్ని, కాలి మెట్టెలను తీసివేసి లోపలికి వెళ్లాను. ముస్లిం మహిళల హిజాబ్‌ను ఎలా తనిఖీ చేసి అనుమతించారో,అలానే మమ్మల్ని కూడా తనిఖీ చేసి లోపలికి అనుమతించాల్సి ఉండేది’’ అని ఓ అభ్యర్థిని చెప్పారు.
Also Read : Boda Janardhan : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌కి షాక్
కర్ణాటక రాష్ట్రంలోని వివిధ బోర్డులు, కార్పొరేషన్లలో పోస్టులను భర్తీ చేయడానికి అభ్యర్థులను రిక్రూట్ చేసే కర్ణాటక పరీక్షలో కొంతమంది విద్యార్థులు చీటింగ్‌కు గురైన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. గతంలో పరీక్ష హాలులో కొందరు అభ్యర్థినులు బ్లూటూత్ పరికరాలను వాడుతూ పట్టుబడ్డారు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో మహిళా అభ్యర్థినుల మంగళసూత్రాల తొలగింపు ఘటన సంచలనం రేపింది. దీనిపై రాష్ట్రంలో వివాదం రాజుకుంది.