Boda Janardhan : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌కి షాక్

తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫ్యాక్స్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు.. Boda Janardhan

Boda Janardhan : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌కి షాక్

Boda Janardhan (Photo : Google)

Updated On : November 5, 2023 / 11:00 PM IST

Boda Janardhan Resign Congress : ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. మాజీమంత్రి బోడ జనార్దన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ కి ఆయన జీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫ్యాక్స్ చేశారు బోడ జనార్దన్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు బోడ జనార్దన్. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన బోడ జనార్దన్.. బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన మందమర్రి బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో కారు ఎక్కనున్నారు బోడ జనార్దన్.

Also Read : కేసీఆర్ సింహం లాంటోడు, సింగిల్‌గానే వస్తాడు- మంత్రి కేటీఆర్

తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు బోడ జనార్దన్. రాష్ట్రాభివృద్ధి కోసమే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ రాకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. బోడ జనార్దన్ చెన్నూర్ టికెట్ ఆశించారు. అయితే, కాంగ్రెస్ పెద్దల నుంచి ఆయనకు ఎలాంటి హామీ దక్కలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.

Also Read : రైతుకు అన్నం పెట్టేది తుమ్మ, పనికి రాని పువ్వు పువ్వాడ- సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీల్లో కామన్ గా కనిపిస్తున్న అంశం జంపింగ్ లు, చేరికలు. టికెట్ ఆశించి భంగపడ్డ వారు కొందరు, పార్టీలో తమకు సరైన గుర్తింపు, ప్రాధాన్యం లేదని మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో తెల్లారేసరికల్లా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. రాత్రి వరకు ఒక పార్టీలో ఉన్న వారు తెల్లారేసరికి మరో పార్టీలో కనిపిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీల పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ మూడు పార్టీల్లో ఇప్పుడు కనిపిస్తున్న సీన్ ఇదే. ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ తమకే వస్తుందని ఆశలు పెట్టుకున్న నాయకులు.. తీరా టికెట్ రాకపోయేసరికి బాగా హర్ట్ అవుతున్నారు. తీవ్రమైన బాధతో, అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. కొంతమంది పక్క పార్టీ వాళ్లతో మాట్లాడుకుని టికెట్ ఇస్తామనే హామీ ఇస్తేనే జంప్ అవుతున్నారు. మొత్తంగా చేరికలు, వలసలు, రాజీనామాలు అన్ని పార్టీల్లోనూ కామన్ కనిపిస్తున్న అంశం.