KTR : కేసీఆర్ సింహం లాంటోడు, సింగిల్‌గానే వస్తాడు- మంత్రి కేటీఆర్
ఢిల్లీ దొరలు మోడీ, రాహుల్ గాంధీకి తెలంగాణ పవర్ చూపిస్తాం. మోడీ, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేరు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి సత్తా లేక పక్క రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా? KTR

KTR Says KCR Is Lion (Photo : Facebook)
KTR Says KCR Is Lion : ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ తో పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలు గుంపులు గుంపులుగా వస్తున్నాయని మండిపడ్డారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు, ఇటు బీజేపీ పెద్దలు తెలంగాణకు వస్తుండటం ఇందుకు నిదర్శనం అన్నారు. ఒక్క కేసీఆర్ ను ఓడగొట్టడానికి గుంపులు గుంపులుగా వస్తున్నారు, కానీ కేసీఆర్ నమ్ముకున్నది తెలంగాణ ప్రజలను అని కేటీఆర్ చెప్పారు. అంతేకాదు కేసీఆర్ సింహంలాంటోడని, సింగిల్ గానే వస్తాడని కేటీఆర్ తేల్చి చెప్పారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడంపెల్లి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
Also Read : సీపీఎం నేతలతో కాంగ్రెస్ బుజ్జగింపులు.. తమ్మినేనికి భట్టి విక్రమార్క ఫోన్, పోటీపై పునరాలోచన చేయాలని విన్నపం
”ఢిల్లీ దొరలు మోడీ, రాహుల్ గాంధీకి తెలంగాణ పవర్ చూపిస్తాం. మోడీ, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేరు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి సత్తా లేక పక్క రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా? కాంగ్రెస్, బీజేపీల అభ్యర్దులు బి-ఫామ్ కావాలన్నా, బాత్రూం కి పోవాలన్నా ఢిల్లీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. చిల్లర పైసల లాంటోళ్లు ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అయితే జేబులో కడక్ నోటు లాంటోడు కేసీఆర్” అని కేటీఆర్ అన్నారు.
Also Read : నేడే బీజేపీ నాలుగో జాబితా విడుదల? జనసేనకు కేటాయించే ఆ 9 సీట్లపై ఉత్కంఠ