BJP Fourth List : నేడే బీజేపీ నాలుగో జాబితా విడుదల? జనసేనకు కేటాయించే ఆ 9 సీట్లపై ఉత్కంఠ

BJP Fourth List

BJP Fourth List : నేడే బీజేపీ నాలుగో జాబితా విడుదల? జనసేనకు కేటాయించే ఆ 9 సీట్లపై ఉత్కంఠ

BJP To Release Fourth List

Updated On : November 5, 2023 / 5:37 PM IST

BJP To Release Fourth List : బీజేపీ నాలుగో విడత అభ్యర్థుల జాబితా సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. జనసేనకు 9 సీట్లు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఆ సీట్లను మినహాయించి మిగతా స్థానాలకు గెలుపు గుర్రాలను ఖరారు చేశారు. ఇప్పటికే 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.

Also Read : సీపీఎం నేతలతో కాంగ్రెస్ బుజ్జగింపులు.. తమ్మినేనికి భట్టి విక్రమార్క ఫోన్, పోటీపై పునరాలోచన చేయాలని విన్నపం

ఇప్పటివరకు మూడు విడతలుగా బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మూడు విడతల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 55మందిని, రెండో జాబితాలో ఒకే పేరుని, మూడో జాబితాలో 32 మంది పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 22 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసేందుకు బీజేసీ సిద్ధమవుతోంది. బీజేపీ-జనసేన పొత్తు నేపథ్యంతో 9 సీట్లను ఆ పార్టీకి ఇవ్వనుంది. జనసేన పొత్తు మినహా 22 సీట్లకు గెలుపుగుర్రాలను ప్రకటించనుంది.

జనసేనకు కేటాయించే 9 స్థానాలపై ఉత్కంఠ..
కాగా, జనసేనకు బీజేపీ కేటాయించనున్న 9 సీట్లపై ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఏయే స్థానాలు కేటాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం, వైరా, కోదాడ, అశ్వరావు పేట, తాండూరు, నాగర్ కర్నూల్, కొత్తగూడం, కూకట్ పల్లి.. ఈ 8 నియోజకవర్గాలతో పాటు మరొక సీటును (మేడ్చల్ లేదా నాంపల్లి) జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్ భేటీ అయ్యి సీట్ల కేటాయింపుపై చర్చించారు. ఒకటి రెండు సీట్లపై కొంత పేచీ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా సీట్ల సర్దుబాటు ఫైనల్ అయినట్లు సమాచారం.

Also Read : బీసీలు తలచుకుంటే తెలంగాణలో ఏదైనా సాధ్యమే.. రెండు రోజుల్లో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తాం

జనసేన ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. ఎన్డీయే పక్ష సమావేశాలకు కూడా హాజరైంది. తెలంగాణలో జనసేన పోటీకి సిద్ధమైన సందర్భంలో.. తెలంగాణలో బీజేపీకి ఉన్న బలంతో పాటు పవన్ కల్యాణ్ కున్న చరిష్మాను పార్టీకి తోడు చేసే విధంగా జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేటలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అలాంటి చోట్లు జనసేనకు కేటాయించడంతో పవన్ చరిష్మా ఉపయోగపడుతుందని, జనసేన ఓటు బీజేపీకి పోలరైజ్ అవుతుందనే భావనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు.