Thummala Nageswara Rao : రైతుకు అన్నం పెట్టేది తుమ్మ, పనికి రాని పువ్వు పువ్వాడ- సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్
కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది నేను. కావాలంటే చంద్రబాబుని అడగొచ్చు. బీఆర్ఎస్ కు దిక్కులేని సమయంలో నేను జెండా కట్టి జిల్లాను అప్పజెప్పా. Thummala Nageswara Rao

Thummala Nageswara Rao Counter TO KCR
Thummala Nageswara Rao Counter TO KCR : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సెటైర్లు వేసుకుంటున్నారు. తాజాగా పువ్వాడను పువ్వుతో పోల్చిన కేసీఆర్, తుమ్మలను తుమ్మ ముల్లుతో పోల్చారు. దీనికి కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ లపై విరుచుకుపడ్డారు.
కేసీఆర్ 3 నెలలు బతిమిలాడారు..
”మంత్రి పువ్వాడ 4 పార్టీలు మారారు. అజయ్ తన తండ్రిని అప్రతిష్ట పాలు చేశారు. రాష్ట్రం విడిపోయేదాకా తెలుగుదేశాన్ని కాపాడే ప్రయత్నం చేశాను. కేసీఆర్ మూడు నెలలు బమితిలాడితే వెళ్లాను. పువ్వాడ వయ్యారి భామ లాంటి పువ్వు. పూజకు పనికి రాని పువ్వు. తుమ్మ చెట్టు ముదిరితే నీళ్లు లేకుండా బతికి అరక లాగా మారి, రైతుకు అన్నం పెట్టడానికి తుమ్మ పనికొస్తుంది.
Also Read : సీపీఎం నేతలతో కాంగ్రెస్ బుజ్జగింపులు.. తమ్మినేనికి భట్టి విక్రమార్క ఫోన్, పోటీపై పునరాలోచన చేయాలని విన్నపం
పువ్వాడ మీ బాబు కాలంలో ట్యాంకర్లున్నాయనే విషయం మరిచిపోకు. ఖమ్మంలో కట్టిన ప్రతి ట్యాంకుని అడుగు. అక్కడ పెట్టిన బోర్డులు చూడు నీకు తెలుస్తుంది. పువ్వాడకు మెడకాయ మీద తలకాయ లేదు. కాబట్టే బస్ డిపో రోడ్డులో సెంట్రల్ లైటింగ్ వేశాడు. గోళ్లపాడు ఛానల్ లో నిధులు మింగింది నువ్వు. నేను హైవేల పై లైట్లు పెట్టా. నువ్వు కమీషన్ల కోసం డొంకల్లో లైట్లు వేశావు.
కేసీఆర్ కి పదవి ఇప్పించింది నేనే.. కావాలంటే చంద్రబాబుని అడగొచ్చు
కేసీఆర్ కు దిమ్మదిగిరిపోయి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కు దిక్కులేని సమయంలో నేను జెండా కట్టి జిల్లాను అప్పజెప్పా. 6వేల డబుల్ బెడ్ రూమ్ లు నేను తీసుకొచ్చా. ఆరేళ్లు అయినా పువ్వాడ ఒక్క పథకం తేలేదు. కాంట్రాక్టర్లను బెదిరించిన సంస్కృతి పువ్వాడది. ఆంధ్ర-తెలంగాణలో కట్టిన ప్రతి ప్రాజెక్టులో నా భాగస్వామ్యం ఉంది. కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది నేను. కావాలంటే చంద్రబాబుని అడగొచ్చు. చంద్రబాబు మొదలు మీకు ఫారెస్ట్ మినిస్టర్ పోర్ట్ ఫోలియో రాశారు. ముఖ్యమంత్రి ప్రతిసారి అబద్దాలు మాట్లాడతారు. కాబట్టి మనం పట్టించుకోనక్కర్లేదు.
నాకు వెన్నుపోటు పొడిచారు..
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేరుకే ఎంపీ. ఒక్క కార్యక్రమానికి కూడా ఆయనను పిలవడం లేదు. గౌరవించడం లేదు. 30వ తేదీన పువ్వాడను 14 అడుగుల గోతిలో పాతి పెడతారు. పువ్వాడ నీ భూమి కూనవరం. ఈసారి నువ్వు వచ్చి అబద్దాలు మాట్లాడితే నిన్ను డివిజన్ లలో తిరగనివ్వను.
Also Read : నేడే బీజేపీ నాలుగో జాబితా విడుదల? జనసేనకు కేటాయించే ఆ 9 సీట్లపై ఉత్కంఠ
2018లో పార్టీకి వ్యతిరేకంగా కేటీఆర్ పని చేశారు. నన్ను ఓడించాలని కేటీఆర్ ఆదేశిస్తే, పువ్వాడ అజయ్ కుమార్ పాటించారు. నన్ను వెన్నుపోటు పొడిచారు. అందరి బతుకులు ప్రజల చేతుల్లో ఉన్నాయి. గుండు సున్న ఉన్న బీఆర్ఎస్ పార్టీని నేను ఒక స్థాయికి తీసుకొచ్చా. నాకు రూ.116 లు ఇచ్చి మరీ ఓటెయ్యాలి” అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.