Work from home : ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్…50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గాలి నాణ్యత కొరవడటంతో వాయు కాలుష్యం నిరోధానికి సర్కారు చర్యలు చేపట్టింది....

Work from home
Work from home : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గాలి నాణ్యత కొరవడటంతో వాయు కాలుష్యం నిరోధానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణకు ఢిల్లీలో భవన నిర్మాణాలను నిలిపివేశారు.
Also Read : టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్.. ఎలా క్లీన్ చేయాలో తెలుసా?
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 మార్కును దాటింది. దీంతో నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు 8 అంశాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఢిల్లీలోకి ఎల్‌ఎన్‌జి, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ట్రక్కులు మినహా ఇతర ట్రక్కుల ట్రాఫిక్‌ను పూర్తిగా నిషేధించారు. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన తేలికపాటి వాహనాలు అవసరమైన వస్తువులను తీసుకువెళ్లడం, అందించడం మినహా ఢిల్లీలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధించారు.
Also Read : Boda Janardhan : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌కి షాక్
ఢిల్లీలో నమోదైన డీజిల్ హెవీ గూడ్స్ వెహికిల్స్ అత్యవసర వస్తువులను మాత్రమే తీసుకువెళ్లవచ్చు. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు, పవర్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్‌లు మొదలైన లీనియర్ పబ్లిక్ ప్రాజెక్ట్‌లలో నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం విధించారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో 6 నుంచి 9వతరగతి వరకు, 11వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
Also Read : Amala Paul : బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‌తో అమలాపాల్ పెళ్లి ఫోటోలు..
రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ల ప్రకారం బేసి-సరి ప్రాతిపదికన వాహనాలను అనుమతించడం వంటి అదనపు అత్యవసర చర్యలు తీసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల్లో గడ్డివాములను కాల్చే సంఘటనల పెరుగుదల కారణంగా ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత సూచిక శనివారం సాయంత్రం 4 గంటలకు 415 నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 463కి దిగజారింది. వాయు కాలుష్య సంక్షోభం ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లోని పలు నగరాల్లో కూడా ప్రమాదకరమైన వాయు కాలుష్యం పెరిగింది.