Team Indias win : దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా విజయం… యూపీ వధూవరుల సంబరాలు
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నగరంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని వధూవరులు తమ బంధువులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.....

UP bride groom
Team Indias win : దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా విజయం సాధించినందుకు యూపీ వధూవరులు పెళ్లి మండపంలోనే సంబరాలు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నగరంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని వధూవరులు తమ బంధువులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ జంట భారత జాతీయ జెండాతో ఫొటోలు దిగారు. వధూవరుల కుటుంబ సభ్యులు క్రికెటర్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని చేతిలో పట్టుకుని చిత్రంలో కనిపించారు.
Also Read : Work from home : ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్…50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం
‘‘ఈ రోజు నా పెళ్లి కావడం, ఈ రోజే భారత్ కూడా గెలిచి సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేయడంతో ఇది నాకు డబుల్ ధమాకా అని వరుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి భావోద్వేగాలను వధువు కూడా వ్యక్తం చేసింది. ‘‘అద్భుతంగా అనిపిస్తోంది.. ఈ రోజు మేం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’ అని వధువు పేర్కొంది.
Also Read : Boda Janardhan : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌కి షాక్
మొత్తంమీద పెళ్లి మండపంలోనే టీం ఇండియా విజయం సందర్భంగా వధూవరులే కాకుండా వారి బంధువులు, పెళ్లికి వచ్చిన అతిథులు ఆనందంలో మునిగి తేలారు. ఈ సంబరాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WATCH | Uttar Pradesh: A bride and groom, along with their relatives and friends, celebrate the victory of Team India against South Africa, in Moradabad
"It is a 'double dhamaka' for me as today is my wedding and India has also won today and Virat Kohli has equalled Sachin… pic.twitter.com/andXVGrEko
— ANI (@ANI) November 5, 2023