Ram Temple
Ram Temple : దేశంలోని హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలు వచ్చే ఏడాది జనవరి నెలలో భక్తుల కోసం తెరచుకోనున్నాయి. జనవరి నెలలో రామాలయ ప్రతిష్ఠాపన వేడుకకు ముందు ఆదివారం అక్షత పూజతో ఆచారాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల ప్రారంభంతో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పనులు ముమ్మరం చేశారు. అయోధ్యలోని ఆలయంలో 100 క్వింటాళ్ల బియ్యంతో పసుపు,దేశీ నెయ్యి కలిపి అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
Also Read : School Principal Arrest : పాఠశాలలో 50 మంది బాలికలపై లైంగిక వేధింపులు…కీచక ప్రిన్సిపాల్ అరెస్ట్
దేశంలోని 45 సంస్థాగత ప్రావిన్సుల నుంచి అయోధ్యకు చేరుకున్న విశ్వ హిందూ పరిషత్ లోని 90 మంది,ఆర్ఎస్ఎస్ సభ్యులకు ఈ పూజిత్ అక్షత్ పంపిణీ చేయనున్నారు. ఈ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు జనవరి 22వతేదీ లోపు ముడుపుల వేడుకకు ముందు దేశవ్యాప్తంగా బియ్యాన్ని పంపిణీ చేస్తారని ట్రస్ట్ తెలిపింది.
Also Read : Work from home : ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్…50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం
ఈ అక్షింతలను పంపిణీ చేయడం ద్వారా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. ఈ అక్షింతలను జనవరి 1 నుంచి 15వతేదీల మధ్య కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా కార్యకర్తలు హిందువుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు.
Also Read : Team Indias win : దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా విజయం… యూపీ వధూవరుల సంబరాలు