Amanchi Krishna Mohan : చంద్రబాబును పురందేశ్వరి వెనకేసుకు రావడం విడ్డూరం : ఆమంచి

దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు గురించి పుస్తకం రాశారని దానిని చదివి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుడని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆమంచి ప్రశ్నించారు.

Amanchi Krishna Mohan : చంద్రబాబును పురందేశ్వరి వెనకేసుకు రావడం విడ్డూరం : ఆమంచి

Amanchi Krishna Mohan

Updated On : November 18, 2023 / 11:38 PM IST

Amanchi Krishna Mohan – Purandeswari : వైసీపీపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమంచి కృష్ణ మోహన్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు గత చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని పురందేశ్వరికి హితవు పలికారు. టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు తప్పు చేయలేదని అనడంలేదని కానీ, పురందేశ్వరి వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. స్కిల్ డెవలపమెంట్ స్కాంలో చంద్రబాబు తప్పు చేశారని తెలిపారు. చంద్రబాబు జైలుకు వెళ్లి మూడు నెలలైందని తెలిపారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు గురించి పుస్తకం రాశారని దానిని చదివి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుడని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆమంచి ప్రశ్నించారు. ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఆయన గత చరిత్ర గురించి తెలుసుకోవాలని హితవు పలికారు.