Home » Cardamom
చాలా మంది టీ లో ఏలకుల పొడి వేసికుని ఉదయాన్నే సేవించేందుకు ఇష్టపడతారు. అజీర్ణం, గుండెల్లో మంట, పేగులో సమస్యలు, విరేచనాలు వంటివాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. అద్భుతమైన వాసన, రుచి , జీర్ణ లక్షణాలను యాలకులు కలిగి ఉన్నాయి.
కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపు సమస్యలు అదుపులోకి వస్తాయి. అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది.
ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. నిద్ర బాగా పడుతుంది.
యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్ శరీరంలోని బీపిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. స్మోకింగ్ అలవాటును దూరం చేయడంలో యాలకులు అద్భుతంగా సహాయ పడతాయి.
యాలకుల లోపలి గింజలను తీసి మెత్తని పొడిగా చేసి మీగడలో కలిపి తీసుకుంటే నోటి పూత తగ్గిపోతుంది. ఒక మెత్తని క్లాత్ లో వేసి మూట కట్టి వాసన పీల్చుతూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది.
ఆయుర్వేదంలో యాలకులను విరివిగా వినియోగిస్తారు. శరీరానికి చలువ కలిగించే గుణం యాలుకల్లో ఉండటంతో ఆహారాల్లో వీటిని వాడుతారు. కుంకుమ పువ్వు తరువాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా యాలుకలను చెప్పవచ్చు.