Benefits of Cardamom : జీర్ణక్రియను సులభతరం చేయటంతోపాటు రక్తపోటును తగ్గించటంలో సహాయపడే ఏలకులు !
చాలా మంది టీ లో ఏలకుల పొడి వేసికుని ఉదయాన్నే సేవించేందుకు ఇష్టపడతారు. అజీర్ణం, గుండెల్లో మంట, పేగులో సమస్యలు, విరేచనాలు వంటివాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. అద్భుతమైన వాసన, రుచి , జీర్ణ లక్షణాలను యాలకులు కలిగి ఉన్నాయి.

cardamom benefits
Benefits of Cardamom : ఆయుర్వేదంలో ఏలకులకు ప్రత్యేక స్ధానం ఉంది. ఏలకులను సుగంధ ద్రవ్యాల రాణి’గా పిలుస్తారు. ఏలకులు వివిధ సంస్కృతీ సంప్రదాయాలలో , ఆచారాలు, వేడుకలలో ఆతిథ్యానికి చిహ్నంగా ఉపయోగిస్తున్నారు. తీపి వంటకాలలో మంచి రుసితోపాటు, సువాసన కోసం యాలకులను ఉపయోగిస్తారు. సుమారు 200 సంవత్సరాల క్రితం, రీసెర్చ్ గేట్ అధ్యయనం ప్రకారం, దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలోని అడవులలో పెరిగిన ఏలకులు ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. చరక సంహిత, కౌటిల్యుడి అర్థశాస్త్రం, తైతిర్రియ సంహిత వంటి అనేక ప్రాచీన గ్రంథాలలో ఏలకులను ప్రస్తావించారు.
READ ALSO : Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటే ?
చాలా మంది టీ లో ఏలకుల పొడి వేసికుని ఉదయాన్నే సేవించేందుకు ఇష్టపడతారు. అజీర్ణం, గుండెల్లో మంట, పేగులో సమస్యలు, విరేచనాలు వంటివాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. అద్భుతమైన వాసన, రుచి , జీర్ణ లక్షణాలను యాలకులు కలిగి ఉన్నాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రవిసర్జన ద్వారా టాక్సిన్స్‌ను తొలగిస్తుంది కాబట్టి మూత్రపిండాలకు సూపర్‌ఫుడ్ కూడా చెప్తుంటారు. వివిధ జననేంద్రియ, మూత్ర సంబంధిత సమస్యల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు. నోటి ఆరోగ్యం, నోటి దుర్వాసనను పోగొట్టటం, దంత క్షయాలను నివారించడంలో దీనిలోని యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు బాగా ఉపకరిస్తాయి.
READ ALSO : Thyroid Problems : థైరాయడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !
ఏలకులలోని యాంటీ బాక్టీరియల్ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెదడును ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడతాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ బయోఫిజిక్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రోజుకు కేవలం ½ టీస్పూన్ ఏలకులు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణ సమస్యల నుండి శ్వాసకోశ సమస్యల వరకు అనేక రకాల వ్యాధుల చికిత్సకు పురాతన కాలం నుండి ఉపయోగిస్తూ వస్తున్నారు.
READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..
ఏలకులు ఆరోగ్య ప్రయోజనాలు;
1. తిన్నఆహారం జీర్ణ కావటానికి : ఏలకులు ఉబ్బరం, అజీర్ణం , గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కడుపుకు ఉపశమనం కలిగించటంలో, సాంప్రదాయ వైద్యంలో ఏలకులు ఉపయోగిస్తారు.
2. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు: ఏలకులు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
3. తాజా శ్వాస: ఏలకుల గింజలను నమలడం వల్ల శ్వాసను ఫ్రెష్‌గా మార్చుకోవచ్చు. సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి.
4. యాంటీ ఇన్ఫ్లమేటరీ: మసాలా శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
5. గుండె ఆరోగ్యం : కొన్ని అధ్యయనాలు ఏలకులు రక్తపోటును తగ్గించడం, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
READ ALSO : Black Rice : బ్లాక్ రైస్ ను ఆహారంగా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఏలకులను ఎవరు నివారించాలి
అలెర్జీలు ఉన్న వ్యక్తులు ఏలకులను తీసుకోకుండా ఉండటమే మంచిది. ఏలకులు, జీర్ణకోశ పూతలు, పిత్తాశయ రాళ్లకు అలెర్జీలు ఉన్నవారు తీసుకోవటం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పాటించటం మంచిది.