Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటే ?

యవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకునే వారికి డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. వాటిలో ముఖ్యమైన నూనెలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటే ?

dry fruits

Dry Fruits : బాదం మరియు వాల్‌నట్ వంటి గింజలు శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే ఇవి చాలా ఖరీదైనవి. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాలు కేంద్రీకృతమై ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ , నట్స్ ను చాలా మధ్య భోజన సమయాలకు మధ్య ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండిగా తీసుకుంటుంటారు. వాటిలో అధిక పోషకాలు,ప్రోటీన్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

డ్రై ఫ్రూట్స్ మీ శరీరానికి చేసే మేలు ;

రోగనిరోధక శక్తిని పెంచటంలో ; డ్రై ఫ్రూట్స్‌లో ఎసెన్షియల్ ఆయిల్స్, ప్రొటీన్లు, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.

బరువు తగ్గడానికి ; డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ ను మితంగా తింటే బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తాయి. అవి తక్కువ కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర , ప్రోటీన్లతోపాటు ముఖ్యమైన నూనెలను కలిగి ఉంటాయి.

READ ALSO : Eating Too Much Fish : చేపలను ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావంపడుతుందా ?

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ; యవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకునే వారికి డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. వాటిలో ముఖ్యమైన నూనెలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని పునరుద్ధరించడానికి , వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడతాయి.

మలబద్ధకం వ్యతిరేకంగా పోరాడటంలో ; డ్రై ఫ్రూట్స్‌లో పెద్ద సంఖ్యలో డైటరీ ఫైబర్స్ ఉంటాయి. ఇవి మలబద్ధకంతో పోరాడటానికి , గట్ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

READ ALSO : Benefits of Makhanas : గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణలో మఖానాస్ తో కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు

క్యాన్సర్ రాకుండా ; బాదం, జీడిపప్పు రొమ్ము క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి క్యాన్సర్ కారక కణాల కార్యకలాపాలను నిరోధిస్తాయి.

గుండె ఆరోగ్యానికి ; డ్రై ఫ్రూట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ముఖ్యంగా ఎండుద్రాక్ష గుండె జబ్బులు, పక్షవాతం మొదలైన వాటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

READ ALSO : Eating Too Much Fish : చేపలను ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావంపడుతుందా ?

ఎముకల ఆరోగ్యానికి ; డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు, కాల్షియంతోపాటు ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలు ఆరోగ్యానికి, వాటిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

ఒత్తిడి తగ్గించటంలో ; డిప్రెషన్ , ఒత్తిడిని తగ్గించటంలో డ్రై ఫ్రూట్స్ చాలా ప్రభావవంతంగా ఉపకరిస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యం , జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

READ ALSO : Vitamin K: విటమిన్ కె వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసా ?

రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్‌ను పెంచటంలో ; ఎండుద్రాక్ష , ప్రూనేలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడుతున్న వారికి సహాయడతాయి. విటమిన్ ఎ, బి , కె వంటివి డ్రై ఫ్రూట్స్‌లో ఉంటాయి. రాగి, మెగ్నీషియం మరియు ఇనుము వంటి ఖనిజాలు శరీరంలో ఎర్ర రక్త కణాలు , హిమోగ్లోబిన్ పునరుత్పత్తికి సహాయపడే అసంతృప్త కొవ్వులను అందిస్తాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహాన కోసం మాత్రమే. ఆరోగ్య సమ్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.