Vitamin K: విటమిన్ కె వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసా ?

పెద్దవారిలో విటమిన్ K లోపం చాలా అరుదుగా ఉంటుంది. కానీ యాంటీబయాటిక్స్ వంటి విటమిన్ K జీవక్రియను నిరోధించే మందులు తీసుకునే వారిలో లోపం సమస్యలు తలెత్తుతాయి. నవజాత శిశువులలో లోపిస్తుంది. ఎందుకంటే విటమిన్ K తల్లి పాలలో తక్కువ మొత్తం ఉంటుంది.

Vitamin K: విటమిన్ కె వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసా ?

Vitamin K Benefits

Vitamin K: విటమిన్ K అనేది కొవ్వులో కరిగే విటమిన్, ఇది రెండు రూపాల్లో లభిస్తుంది. ప్రధాన రకాన్ని ఫైలోక్వినోన్ అని పిలుస్తారు, ఇది కొల్లార్డ్ గ్రీన్స్, బచ్చలికూర వంటి ఆకు కూరలలో లభిస్తుంది. రెండో రకం మెనాక్వినోన్స్, కొన్ని జంతువుల ఆహారాలు, పులియబెట్టిన ఆహారాలలో కనిపిస్తాయి. మెనాక్వినోన్స్ మానవ శరీరంలోని బ్యాక్టీరియా ద్వారా కూడా ఉత్పత్తి అవుతాయి. విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి , ఎముకల నిర్మాణానికి అవసరమైన వివిధ ప్రోటీన్లను తయారికి సహాయపడుతుంది. ప్రోథ్రాంబిన్ అనేది విటమిన్ K-ఆధారిత ప్రోటీన్, ఇది రక్తం గడ్డకట్టడంలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది. ఆస్టియోకాల్సిన్ అనేది ఆరోగ్యకరమైన ఎముక కణజాలాన్ని ఉత్పత్తి చేయడానికి విటమిన్ K అవసరమయ్యే మరొక ప్రోటీన్.

READ ALSO : Improve Your Memory : మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గాలంటే !

విటమిన్ K కాలేయం, మెదడు, గుండె, ప్యాంక్రియాస్ , ఎముకతో సహా శరీరం అంతటా విస్తరించి ఉంటుంది. ఇది చాలా త్వరగా విచ్ఛిన్నమవుతుంది. మూత్రం లేదా మలం ద్వారా విసర్జించబడుతుంది. 19 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు, పురుషులకు రోజుకు 120 మైక్రోగ్రాములు (mcg) , స్త్రీలకు, గర్భిణీ లేదా పాలిచ్చే వారికి 90 mcg. విటమిన్ కె అవసరమవుతుంది.

విటమిన్ K అనేది రక్తం గడ్డకట్టడం, ఎముకల ఆరోగ్యం, గుండె వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. విటమిన్ కె బచ్చలికూర, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, పాలకూరలతో సహా పచ్చని ఆకు కూరలు సోయాబీన్ వంటి వాటిలో అధిక మొత్తంలో ఉంటుంది. మాంసం, చీజ్, గుడ్లలో తక్కువ మొత్తంలో లభిస్తుంది.

READ ALSO : Eye Health : కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు

విటమిన్ కె లోపం సంకేతాలు ;

పెద్దవారిలో విటమిన్ K లోపం చాలా అరుదుగా ఉంటుంది. కానీ యాంటీబయాటిక్స్ వంటి విటమిన్ K జీవక్రియను నిరోధించే మందులు తీసుకునే వారిలో లోపం సమస్యలు తలెత్తుతాయి. నవజాత శిశువులలో లోపిస్తుంది. ఎందుకంటే విటమిన్ K తల్లి పాలలో తక్కువ మొత్తం ఉంటుంది. పుట్టినప్పుడు రక్తం గడ్డకట్టే ప్రొటీన్ల పరిమిత పరిమాణం శిశువులకు విటమిన్ కె సప్లిమెంట్లను ఇవ్వకపోతే రక్తస్రావం ప్రమాదాన్ని పెరిగేలా చేస్తుంది.

READ ALSO : Natural Kajal : ఆడవారి అందాన్ని రెట్టింపు చేసే కాటుక.. రసాయనాలు లేని కాటుక ఎలా తయారు చేసుకోవాలంటే?

విటమిన్ కె లోపం ఏర్పడితే ఎలాంటి గాయం లేకుండా అధిక రక్తస్రావం కావటం జరుగుతుంది. ఇది విటమిన్ K లోపం కారణంగా కనిపించే అత్యంత సాధారణ లక్షణంగా చెప్పవచ్చు. ఒక చిన్న గాయమైనా అధిక రక్తస్రావం జరుగుతుంది. గాయం అయిన తరువాత రక్తస్రావం ఆగడం త్వరగా జరగదు. విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. విటమిన్ K లోపం కారణంగా గాయం నుండి రక్తం ఆగకుండా ప్రవహిస్తుంటుంది. చిగుళ్ళు బలహీనపడటంతోపాటు అప్పుడప్పుడు రక్తస్రావం జరుగుతుంది. ఎముకలలో నొప్పి, బలహీనతలకు విటమిన్ K లోపం దారితీస్తుంది. శారీరక, మానసిక అలసటకు కారణమవుతుంది.

READ ALSO : Sharathulu Vartisthai : మధ్య తరగతి కుటుంబాలకి ‘షరతులు వర్తిస్తాయి’..!

అదే సమయంలో యాంటీబయాటిక్ మందులు పేగులోని విటమిన్-కె-ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాకు నష్టం కలిగిస్తాయి, తద్వారా విటమిన్ కె స్థాయిలు తగ్గుతాయి, ప్రత్యేకించి కొన్ని వారాల కంటే ఎక్కువ మందులు తీసుకుంటే. దీర్ఘకాలిక యాంటీబయాటిక్స్‌ని ఉపయోగించేవారిలో, ఆకలి తక్కువగా ఉన్నవారిలో విటమిన్ కె లోపం వల్ల ముప్పు పొంచి ఉంటుంది. ఈ సమయంలో వైద్యుల సూచనలతో విటమిన్ కె సప్లిమెంట్లను తీసుకోవచ్చు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే . ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.