Sharathulu Vartisthai : మధ్య తరగతి కుటుంబాలకి ‘షరతులు వర్తిస్తాయి’..!

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు.. 'షరతులు వర్తిస్తాయి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి కుటుంబాలు..

Sharathulu Vartisthai : మధ్య తరగతి కుటుంబాలకి ‘షరతులు వర్తిస్తాయి’..!

Chaitanya Rao BhoomiShetty Sharathulu Vartisthai motion poster released

Updated On : October 22, 2023 / 5:56 AM IST

Sharathulu Vartisthai : 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న చైతన్య రావు.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. త్వరలో తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న చైతన్య రావు.. మరో మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం చైతన్య రావు కుమార స్వామి (అక్షర) దర్శకత్వంలో ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

చైతన్య రావుకి జంటగా భూమి శెట్టి ఈ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్య అథిలుగా పాల్గొన్నారు. మోషన్ పోస్టర్ ని త్రివిక్రమ్ లాంచ్ చేశాడు. మధ్య తరగతి కుటుంబంలోని ఆర్ధిక ఇబ్బందులను చూపిస్తూ ఈ సినిమా సాగనుందని మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ‘షరతులు వర్తిస్తాయి’ అనే టైటిల్ కూడా ఆకట్టుకుంటుంది.

Also read : Nikhil Siddhartha : నిజమైన ‘గేమ్ చెంజర్’ అంటున్న నిఖిల్.. రామ్ చరణ్ అనుకుంటున్నారా..?

ఇక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ మాట్లాడుతూ… మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి తెలిపారు, షరతులు వర్తిస్తాయి చిత్రం కుటుంబ విలువలకు సంబంధించిన సినిమా , ఈ ప్రాంతం మట్టి నుంచి వచ్చిన కథ అని ఇది మన కుటుంబ సంస్కృతిక విలువలతో నిండి ఉన్న సినిమా ఇటువంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర), చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు.