Improve Your Memory : మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గాలంటే !

ఆరోగ్యకరమైన ఆహారం మెదడుకు మంచిది. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు తినండి. చేపలు, బీన్స్ , పౌల్ట్రీ ఉత్పత్తులు, తక్కువ కొవ్వు ప్రోటీన్ ఆహారాలను తీసుకోండి. ఆల్కహాల్ జోలికి వెళ్ళవద్దు. ఆల్కాహాల్ జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.

Improve Your Memory : మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గాలంటే !

Improve Your Memory

Improve Your Memory : బైక్ తాళం చెవి దొరకలేదా? ఇంట్లోకి తీసుకురావాల్సిన కిరాణా వస్తువుల లిస్ట్ ను మర్చిపోయారా? మీకు బాగా పరిచయస్తుడైన వ్యక్తి పేరు గుర్తుకు రాలేదా? ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కోసారి విషయాలను మరచిపోతుంటారు. అయితే ఇలా జ్ఞాపకశక్తి కోల్పోవడం ఏమాత్రం తేలికగా తీసుకోరాదు. జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా చిత్తవైకల్యం నిరోధించాలంటే కొన్ని దైనందిన కార్యకలాపాలు సహాయపడతాయి. జ్ఞాపకశక్తికి పదును పెట్టడానికి సులభమైన మార్గాలను అనుసరించటం ఉత్తమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Vithika Sheru : ఆ రెండు వ్యాధులతో పోరాడుతున్నాను.. కొంతకాలం బ్రేక్ తీసుకుంటాను.. హీరోయిన్ వీడియో వైరల్..

1.శారీరకంగా యాక్టీవ్ గా ఉండటం ; రోజువారి శారీరక శ్రమ ద్వారా మెదడుతో సహా మొత్తం శరీరానికి రక్త ప్రవాహాం పెరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పదును పెట్టటంలో సహాయపడుతుంది. చాలా మంది ఆరోగ్యవంతమైన పెద్ద వయస్సు వారు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాల నడక వంటి మితమైన ఏరోబిక్ వ్యాయామాలు ,లేదా జాగింగ్ వంటి తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామాలను వారానికి 75 నిమిషాలు చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇవేవి చేయకుంటే రోజుకు ఒక 10 నిమిషాల నడవటం అలవాటు చేసుకోవటం మంచిది.

2. మానసికంగా చురుకుగా ఉండటం ; శారీరక శ్రమ శరీర ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడుతుందో అలాగే మనస్సును నిమగ్నం చేసే కార్యకలాపాలు మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మెమరీ లాస్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. క్రాస్‌వర్డ్ పజిల్స్ చేయటం, చదవటం, ఆటలాడటం. సంగీత వాయిద్యం వాయించడం నేర్చుకోవటం, ఇలా కొత్త అభిరుచులను ప్రయత్నించాలి.

READ ALSO : ఆఫ్‌లైన్‌లోనూ వాట్సాప్ మెసేజ్‌ పంపొచ్చు!

3. ఇతరులతో సమయం గడపటం ; సామాజికంగా అందరితో కలివిడిగా ఉండటం అన్నది ఒత్తిడిని దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండేందుకు దోహదం చేస్తాయి. స్నేహితులు, ఇతర వ్యక్తులతో కలిసి కొంత సమయం గడపటం అన్నది ఒంటరితనాన్ని పోగొట్టటంతోపాటు, మెమరీ లాస్ కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

4. ప్రణాళికా బద్ధంగా ఉండటం ; ఇల్లు చిందరవందరగా ఉంటే అన్ని విషయాలను మరచిపోయే అవకాశం ఉంది. నోట్‌బుక్, క్యాలెండర్ , ఎలక్ట్రానిక్ వస్తువులు, అపాయింట్‌మెంట్‌లు,ఇతర ఈవెంట్‌లను ముందుగానే రాసి పెట్టుకోండి. రాసిన ప్రతి దానిని మైండ్ లో ఉంచుకోవటానికి రాసేటప్పుడే పెద్దాగా నోటితో చదవుకోవటం చేయాలి. పూర్తి చేసిన పనులను చెక్ చేసుకోండి. వాలెట్లు, తాళాలు, గ్లాసెస్ వంటి ఇతర అవసరమైన వస్తువులను ఇంటిలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచండి. తద్వారా వాటిని సులభంగా కనుగొనేందుకు అవకాశం ఉంటుంది. పరధ్యానాన్ని వదిలేయాలి. ఒకేసారి అన్ని పనులు చేయవద్దు. గుర్తున్న సమచారంపై ముందుగా దృష్టి కేంద్రీకరిస్తే దానిని పూర్తి చేసిన తరువాత మిగిలిన విషాయాలు గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

READ ALSO : Google Feedback Feature : గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీడ్‌బ్యాక్ ఫీచర్.. భారతీయ యూజర్లు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

5. కంటినిండా నిద్ర ; తగినంత నిద్ర లేకపోవడం జ్ఞాపకశక్తిని కోల్పోయే పరిస్ధితి ఏర్పడుతుంది. కాబట్టి నిద్రలేమి పరిస్ధితి లేకుండా చూసుకోవాలి.. తగినంత ఆరోగ్యకరమైన నిద్రకు సమయం కేటాయించాలి. పెద్దలు రోజూ 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి. గురక వల్ల నిద్రకు భంగం కలుగుతుంటే వైద్యులను సంప్రదించి చికిత్స పొందటం మంచిది.

6. ఆరోగ్యకరమైన ఆహారం ; ఆరోగ్యకరమైన ఆహారం మెదడుకు మంచిది. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు తినండి. చేపలు, బీన్స్ , పౌల్ట్రీ ఉత్పత్తులు, తక్కువ కొవ్వు ప్రోటీన్ ఆహారాలను తీసుకోండి. ఆల్కహాల్ జోలికి వెళ్ళవద్దు. ఆల్కాహాల్ జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.

7. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు; అధిక రక్తపోటు, మధుమేహం, నిరాశ, వినికిడి లోపం, ఊబకాయం వంటి సమస్యలతో బాదపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స పొందటం మంచిది. దీని వల్ల జ్ఞాపకశక్తి అంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

READ ALSO : Pawan Kalyan : కులమతాల గురించి మాట్లాడేటప్పుడు రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి.. పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్ధేశం

జ్ఞాపకశక్తి తగ్గటం అన్నది రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. వివిధ రకాల పరీక్షల ద్వారా వారు తగిన వైద్య సహాయం అందించేందుకు అవకాశం ఉంటుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహాన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.