Vithika Sheru : ఆ రెండు వ్యాధులతో పోరాడుతున్నాను.. కొంతకాలం బ్రేక్ తీసుకుంటాను.. హీరోయిన్ వీడియో వైరల్..

తాజాగా తాను కొన్ని రోజులు బ్రేక్ తీసుకోబోతున్నాను అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో వితకా షేరు తన హెల్తీ లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత..

Vithika Sheru : ఆ రెండు వ్యాధులతో పోరాడుతున్నాను.. కొంతకాలం బ్రేక్ తీసుకుంటాను.. హీరోయిన్ వీడియో వైరల్..

Vithika Sheru take a break from YouTube and Social Media due to health Issues

Updated On : October 22, 2023 / 8:15 AM IST

Vithika Sheru : ఇటీవల పలువురు సెలబ్రిటీలు తాము ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడితే మొహమాటపడకుండా చెప్తున్నారు. తాజాగా ఒకప్పటి హీరోయిన్, నటుడు వరుణ్ సందేశ్(Varun Sandesh) భార్య వితిక షేరు కూడా తాను ఓ రెండు సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను అని తెలిపింది. గతంలో నటిగా తెలుగు, తమిళ్ లో పలు సినిమాలు చేసింది వితిక షేరు. వరుణ్ సందేశ్ తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నా అప్పుడప్పుడు పలు టీవీ షోలలో పాల్గొంటుంది. అలాగే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా తాను కొన్ని రోజులు బ్రేక్ తీసుకోబోతున్నాను అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో వితకా షేరు తన హెల్తీ లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత.. ఇటీవల నాకు స్పాండిలైటిస్‌, మైగ్రేన్ సమస్యలు వచ్చాయి. మెడనొప్పి, తలనొప్పి వాళ్ళ నేను ఏ పని చేయలేకపోతున్నాను అని తెలిపింది.

Also Read : Trivikram Son : త్రివిక్రమ్ తనయుడిని చూశారా? చాలా గ్యాప్ తర్వాత బయటకి వచ్చిన ఫొటో.. త్వరలో డైరెక్టర్ గా ఎంట్రీ?

అలాగే.. ఇటీవల స్పాండిలైటిస్‌ కు ఫిజియోథెరపీ, సూదుల లాంటి వాటితో గుచ్చినట్టు ఉండే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అప్పుడు బాగానే ఉన్నా ఒత్తిడి వల్ల మరింత పెయిన్ పెరిగింది. దానికి తోడు మైగ్రేన్ కూడా వచ్చి తలనొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకే వీటికి చికిత్స తీసుకోవడం కోసం కొన్ని రోజులు వీడియోలకు, పలు యాక్టివిటీస్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. త్వరలోనే వీటి నుండి కోలుకొని వచ్చి మరిన్ని వీడియోలు చేస్తాను అని తెలిపింది వితిక షేరు. దీంతో పలువురు ప్రముఖులు, ఫాలోవర్లు వితిక త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.