Trivikram Son : త్రివిక్రమ్ తనయుడిని చూశారా? చాలా గ్యాప్ తర్వాత బయటకి వచ్చిన ఫొటో.. త్వరలో డైరెక్టర్ గా ఎంట్రీ?
తాజాగా సిరివెన్నెల తనయుడు నటుడు రాజా త్రివిక్రమ్ కొడుకు ఫోటో లీక్ చేశాడు. త్రివిక్రమ్, సిరివెన్నెల చుట్టాలు అవుతారని అందరికి తెలిసిందే.

Trivikram Son Rishie Manoj Photo Leaked by Actor Raja Chembolu
Trivikram Son : టాలీవుడ్(Tollywood) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. రైటర్ గా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయి పలు సీరియల్స్, సినిమాలకు రచయితగా పనిచేసి సక్సెస్ ఫుల్ రైటర్ అనిపించుకుని నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత మంచి మంచి సినిమాలని అందించారు. త్రివిక్రమ్ సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఆయన మాటలతో మ్యాజిక్ చేసి ప్రేక్షకులకు నచ్చేలా చేస్తాడు.
త్రివిక్రమ్ ఫ్యామిలీ మీడియాకు ఎక్కువగా దూరంగా ఉంటుంది. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య(Sai Soujanya) ఇటీవలే బయటకి రావడం మొదలుపెట్టింది. త్రివిక్రమ్ తన భార్య పేరు మీద ఫార్ట్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సినిమాలు చేస్తుండటంతో ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్స్ కి బయటకి వస్తున్నారు త్రివిక్రమ్ భార్య. త్రివిక్రమ్ కి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ తనయుడి ఫోటోలు కొన్ని బయటకి వచ్చినా కరోనా నుంచి ఇటీవల త్రివిక్రమ్ తనయుడి ఫోటో ఒక్కటి కూడా బయటకి రాలేదు.
తాజాగా సిరివెన్నెల తనయుడు నటుడు రాజా త్రివిక్రమ్ కొడుకు ఫోటో లీక్ చేశాడు. త్రివిక్రమ్, సిరివెన్నెల చుట్టాలు అవుతారని అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ భార్య సౌజన్య, తనయుడు రిషి మనోజ్(Rishie Manoj), రాజా వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ తీసుకోగా రాజా ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అంతే కాక రిషి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారయింది. త్రివిక్రమ్ తనయుడు అంటూ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Rajinikanth : రజినీకాంత్ రోడ్డు మీద ఛాయ్ అమ్ముకుంటున్నారా?.. అచ్చు సూపర్ స్టార్ లాగే..
ఇక త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ కూడా త్వరలోనే డైరెక్షన్ డెబ్యూట్ ఇవ్వబోతున్నాడని, ప్రస్తుతం పలు కోర్సులు నేచుకుంటున్నాడని ఇండస్ట్రీ సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో, త్రివిక్రమ్ తనయుడు రిషి కూడా తండ్రిలాగే దర్శకుడు అవుతాడా చూడాలి మరి.