Home » CBI
అక్రమాస్తులు కలిగి ఉన్నారనే కారణంతో హర్యాణా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. దీంతోపాటు యాభై లక్షల జరిమానా విధిస్తూ, నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది.
చైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం చేరుకున్నారు.
పాకిస్తాన్ నుండి ఆదేశాలతో బెట్టింగ్ నిర్వహించినట్టు గుర్తించింది. పాకిస్తాన్ టూ హైదరాబాద్ బెట్టింగ్ లింకులపై ఆరా తీస్తున్నారు.
బ్యాంకులను నలభై కోట్ల రూపాయలమేర మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై సీబీఐ దాడులు నిర్వహించింది. పంజాబ్లోని అమర్ఘర్ నియోజకవర్గం నుంచి జశ్వంత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచాడు.
సీబీఐపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదని, నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు.
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న హైదారాబాద్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఎస్బీఐ ఆధ్వర్యలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అంటోంది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.
క్రైమ్ డేటాను కూడా సేకరించి సామాజిక దృక్పథం ద్వారా చూస్తే, నేర నియంత్రణ ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవచ్చని అమిత్ షా అన్నారు.
NSE మాజీ సీఈవో దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పరిశీలనలో ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిత్ర రామకృష్ణకు ముందస్తు బెయిల్ నిరాకరించారు.