Home » cloves
దంతాల నొప్పితో బాధపడుతున్న సందర్భంలో లవంగాలను ఉపయోగించటం పూర్వకాలం నుండి మనం చూస్తేనే ఉన్నాయి. నొప్పిని తగ్గించడానికి లవంగాలను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. లవంగాలలోని ప్రాథమిక భాగం అయిన యూజినాల్ ఒక సహజ మత్తుమందుగా పనిచేస్తుంది.
బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడే వారు ఈ లవంగాల కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలోని విష పదార్థాలను, మలినాలను బయటకు పంపాలంటే రోజు కొద్ది మోతాదులో లవంగాలతో తయారు చేసిన కషాన్ని తీసుకోవాలి.
లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.
కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
ముఖ్యంగా లవంగాలు కేన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. కేన్సర్ కణుతుల పెరుగుదలను ఆపడంతోపాటు , కేన్సర్ కణాలను చంపడంలో బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ నాళానికి సంబంధ