Cloves : రక్తపోటు, డయాబెటీస్ తో బాధపడుతుంటే… లవంగాలతో

కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.

Cloves : రక్తపోటు, డయాబెటీస్ తో బాధపడుతుంటే… లవంగాలతో

Cloves

Updated On : March 11, 2022 / 9:44 AM IST

Cloves : భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో లవంగాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. లవంగాలని వంటకాలతో పాటు, కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. లవంగాలు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా, ఆయుర్వేద ఔషద విలువలు కలిగి ఉన్నాయి. దగ్గు సమస్యతో బాధపడుతున్న వారికి ముందుగా గుర్తుకు వచ్చేది లవంగాలే.. అంతేకాకుండా లవంగాలు నోట్లో బుగ్గనపెట్టుకుని దాని రసాన్ని పీల్చుతుంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. తాజా శ్వాస కలిగిస్తుంది.

లవంగాల్లో మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉన్నాయి. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. లవంగం నూనెని పంటి నొప్పులకు ఉపయోగిస్తారు.. లవంగం వాడటం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి దెబ్బ తిన్న పన్ను దగ్గర, పాడైన చిగుళ్లకి పెడితే అది మందులా పనిచేసి నొప్పిని నివారిస్తుంది.

రక్తపోటుకు నివారణకు లవంగం చక్కటి పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రోజు నాలుగైదు లవంగాలను నమలడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. లవంగాలలో నైజీరిసిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను నివారించడంలో, ఇన్సులిన్ చర్యను మెరుగుపర్చడంలో, నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్లు శరీరానికి అందడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది.

రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో రెండు లవంగాలను వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగవచ్చు. లవంగంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అధిక బరువు,కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్, బ్రోన్కైటిస్, సైనస్, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి లవంగం ఉపశమనం కలిగిస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలనూ అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.

లవంగాలకు కొద్దిగా తేనె చేర్చి తీసుకోవడం వల్ల వికారం మరియు వాంతుల నుండి ఉపశమనం కలుగుతుంది. లవంగాలు జీర్ణశక్తిని పెంచుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన సమయంలో చాలా మంది మహిళలు వాంతులు, వికారం సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వారికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. లవంగాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం, ఆపానవాయువు వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం వివిధ మార్గాల ద్వారా సేకరించటం జరిగింది. ఇది కేవలం అవగాహన కల్పించటం కోసమే… వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.