Camphor: మీ ఇంట్లో ఎప్పుడూ ధనం ఉండాలా, వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలా.. ఇలా చేసి చూడండి..!

కర్పూరం, లవంగాలు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టమని.. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. Camphor

Camphor: మీ ఇంట్లో ఎప్పుడూ ధనం ఉండాలా, వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలా.. ఇలా చేసి చూడండి..!

Camphor Representative Image (Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 1:19 AM IST
  • కర్పూరంతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు
  • ఆర్థిక ఇబ్బందులు దూరం చేస్తుంది
  • లక్షీదేవి అనుగ్రహం కలుగుతుంది
  • వాస్తు దోషాలను తొలగిస్తుంది

Camphor: పైసామే పరమాత్మ అని ఊరికే అనలేదు. ఈ రోజుల్లో అందరికీ డబ్బు అవసరం చాలానే ఉంది. డబ్బు లేకుండా ఏ పనీ జరగదు. మరి ఇంట్లో ఎప్పుడూ ధనం ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు కర్పూరానికి సంబంధించిన ఒక చిట్కాని పాటించాలని పండితులు చెబుతున్నారు. కర్పూరంతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చని వెల్లడించారు. ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా, లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండాలన్నా.. కర్పూరంతో రోజూ రాత్రి పూట చిన్న చిట్కా పాటించాలని సూచించారు.

లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే..

ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ కర్పూరం బిళ్లలు వేయాలి. వాటితో పాటు రెండు లవంగాలు వేయాలి. కర్పూరం బిళ్లలు వెలిగించాలి. వెలిగించిన కర్పూరం ఒకసారి ఇళ్లంతా చూపించాలి. దాని వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయట. కర్పూరం, లవంగాలు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టమని.. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అని, అందుకని లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని పండితులు చెబుతున్నారు.

మాకు ఆర్థికంగా కలిసి రావాలి, లక్ష్మీదేవి ఎప్పుడూ మా ఇంట్లో ఉండాలి అని భావించే వాళ్లు రోజూ రాత్రి పూట కర్పూరం వెలిగించాలన్నారు. ఇలా చేస్తే బ్రహ్మాండంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నారు.

పనులు తొందరగా అవ్వాలంటే..

ఇక, పనులు తొందరగా అవ్వాలంటే కర్పూరం నూనె తెచ్చుకుని రోజూ స్నానం చేసే నీళ్లలో రెండు చుక్కల కర్పూరం నూనె వేసుకుని స్నానం చేయాలన్నారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయన్నారు. అలాగే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఒక గిన్నెలో కర్పూరం బిళ్లలు వేసి ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచాలన్నారు. ఇలా చేస్తే.. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయట. ఎలాంటి వాస్తు దోషాలనైనా తొలగించే శక్తి కర్పూరానికి ఉందని పండితులు చెబుతున్నారు.

Also Read: మీ ఇంట్లోని దేవుడి పటాలను ఏ రోజున శుభ్రం చేసుకోవాలి?

Note: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.