మీ ఇంట్లోని దేవుడి పటాలను ఏ రోజున శుభ్రం చేసుకోవాలి?

దేవుడి ఫొటోలను ఏ రోజున శుభ్రం చేయాలో చాలా మందికి తెలియదు.

మీ ఇంట్లోని దేవుడి పటాలను ఏ రోజున శుభ్రం చేసుకోవాలి?

God Photos (Image Credit To Original Source)

Updated On : January 4, 2026 / 5:59 PM IST
  • గురువారం మాత్రమే శుభ్రం చేసుకోవాలి
  • శుక్రవారం దేవుడి ఫొటోలను కదపవద్దు
  • ప్రతి అమావాస్య రోజున శుభ్రం చేసుకోవచ్చు

Hindu Traditions: దేవుడి పట్ల శ్రద్ధ, ఆరాధనా భావం చూపించడానికీ శుభ్రతను పాటిస్తారు. దేవుడి ఫొటోలపై కాలక్రమంలో ధూళి, పొగ, నూనె వంటివి పేరుకుపోతాయి. ఇవి తొలగిస్తే ఫొటో స్పష్టంగా కనిపిస్తుంది.

పూజల సమయంలో పూజాస్థలం శుభ్రం చేయడం సంప్రదాయం. దేవుడి ఫొటోలను కూడా శుభ్రపరచడం అందులో భాగం. ఫొటోలు శుభ్రంగా ఉంటే భక్తి భావం స్థిరంగా ఉంటుంది.

పెద్దలు పాటిస్తూ వచ్చిన సంప్రదాయం కావడంతో ఫొటోలు శుభ్రం చేసే ఆచారాన్ని ఇప్పటివాళ్లూ అనుసరిస్తారు. అయితే, దేవుడి ఫొటోలను ఏ రోజున శుభ్రం చేయాలో చాలా మందికి తెలియదు. ఇది మతపరమైన నమ్మకం, ఆచారం, గౌరవ భావనకు సంబంధించిన చర్య.

దేవుడి ఫొటోలను గురువారం రోజు మాత్రమే శుభ్రం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. చాలా మంది శుక్రవారం కడిగి, బొట్లు పెడుతుంటారు. శుక్రవారం దేవుడి ఫొటోలను కదపవద్దు. గురువారం రోజునే వాటిని కడగాలి. ఆ మరుసటి రోజు (శుక్రవారం) ఈ ఫొటోలకు పూజ చేసుకోవచ్చు.

మళ్లీ తదుపరి గురువారం శుభ్రం చేసుకోండి. శుక్ర, మంగళ వారాల్లో ఫొటోలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ ప్రతి వారం దేవుడి ఫొటోలను శుభ్రం చేయడానికి మీకు ఇబ్బందైతే నెలకు ఒకసారి ప్రతి అమావాస్య రోజున శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ అమావాస్య శుక్రవారం వస్తే ఆ ముందు రోజున అంటే గురువారం శుభ్రం చేసుకోవాలి.

Note: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.