Home » cyclone Yaas
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.
తౌటే తుఫాను విలయం నుంచి కోలుకోక ముందే "యాస్" రూపంలో మరోముప్పు ముంచుకొస్తోంది.
తౌటే విధ్వంసం నుంచి కోలుకోకముందే..బంగాళాఖాతంలో మరో అతి తీవ్ర తుపాన్ ఏర్పడింది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది.