Home » Delhi Municipal Corporation
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆప్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ ఎన్నికైంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బాబీ కిన్నార్ విజయం సాధించింది.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల బరిలోకి ఎంఐఎం దిగింది. డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను ఎంఐఎం పోటీలో నిలిపింది. వారి గెలుపు కోసం ఎంఐఎం అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కృషి చేస్తున్నారు.
ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.
ఢిల్లీలో ఎన్నికల సమరం మొదలు కానుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.