Delhi violent : ఢిల్లీలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి.. ఆ తరువాత పరుగులు పెట్టించిన ఖాకీలు..

Delhi violent : ఢిల్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన కారులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

Delhi violent : ఢిల్లీలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి.. ఆ తరువాత పరుగులు పెట్టించిన ఖాకీలు..

Delhi violent

Updated On : January 7, 2026 / 11:49 AM IST
  • సయ్యద్ ఫైజ్ ఎలాహి మసీదు సమీపంలో కూల్చివేతలు
  • పోలీసులు, మున్సిపల్ సిబ్బందిపై ఆందోళనకారుల రాళ్ల దాడి
  • ఐదుగురు పోలీసులకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
  • టియర్ గ్యాస్ ప్రయోగం.. పలువురు అరెస్ట్

Delhi violent : ఢిల్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన కారులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఢిల్లీలోని రాంలీలా మైదానంలోని ఓ మసీదు సమీపంలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ సిబ్బంది, పోలీసులపై కొందరు స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

Also Read : Gold and Silver Rates Today : సంక్రాంతి పండుగ వేళ షాక్‌ల మీద షాకిలిస్తున్న బంగారం, వెండి ధరలు.. వామ్మో ఇవాళ ఎంత పెరిగాయో తెలుసా..? నేటి ధరలు ఇవే..

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు తుర్క్‌మాన్ గేట్ లోని సయ్యద్ పైజ్ ఎలాహి మసీదు, స్మశాసన వాటికను ఆనుకొని ఉన్న భూమిలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కి చెందిన దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున కూల్చివేతల సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది.

కూల్చివేత సమయంలో కొంతమంది నివాసితులు అధికారులు, పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురి పోలీసులకు గాయాలయ్యాయి. ఐదుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను అక్కడి నుంచి పరుగులు పెట్టించారు. సుమారు 30మందితో కూడి ఓ గుంపు పోలీసులు టార్గెట్ గా రాళ్లదాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి నిధిన్ వల్సన్ తెలిపారు.

పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలించి రాళ్ల దాడికి పాల్పడిన మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గాయపడిన పోలీసులు, ఎంసీడీ సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.