Gold and Silver Rates Today : సంక్రాంతి పండుగ వేళ షాక్‌ల మీద షాకిలిస్తున్న బంగారం, వెండి ధరలు.. వామ్మో ఇవాళ ఎంత పెరిగాయో తెలుసా..? నేటి ధరలు ఇవే..

Gold And Silver Price Today : సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు సామాన్య ప్రజలకు బిగ్ షాకిస్తున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి.

1/8
సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్నారా..? అయితే, బిగ్ షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తద్వారా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.
2/8
అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉధ్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గడిచిన మూడు రోజుల్లో వీటి ధరలు రికార్డు స్థాయిలో పెరగడం గమనార్హం.
3/8
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.660 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 600 పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.4వేలు పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 26డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,467 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధర కూడా రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.12వేలు పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ.26వేలు పెరిగింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,27,850 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,39,480కు చేరింది.
6/8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,28,000 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,39,630కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,28,7000 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,40,400కు చేరింది.
7/8
ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,83,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,63,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,83,000 వద్ద కొనసాగుతుంది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.