DMC Elections AIMIM : ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల బరిలోకి ఎంఐఎం దిగింది. డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను ఎంఐఎం పోటీలో నిలిపింది. వారి గెలుపు కోసం ఎంఐఎం అధ్యక్షులు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కృషి చేస్తున్నారు.

DMC Elections AIMIM : ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఎంఐఎం

DMC Elections MIM (1)

Updated On : November 28, 2022 / 12:33 PM IST

DMC Elections AIMIM : ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల బరిలోకి ఎంఐఎం దిగింది. డీఎంసీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులను ఎంఐఎం పోటీలో నిలిపింది. వారి గెలుపు కోసం ఎంఐఎం అధ్యక్షులు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కృషి చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గుజరాత్‌ అసెబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

గుజరాత్‌లో మొత్తం 14 సీట్లలో బరిలో నిలిచింది. వీటిలో 12 నియోజకవర్గాల్లో ముస్లింలకే సీట్లు కేటాయించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్‌ ఓవైసీ ఢిల్లీలోని పలు వార్డుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. గుజరాత్‌కు, ఢిల్లీలోని సీలంపూర్‌కు తేడా లేదని, రెండు చోట్లా అభివృద్ధి శూన్యమని విమర్శించారు.

Asaduddin Owaisi: రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న ఏఐఎంఐఎం

కనీసం స్కూళ్లు సరిగ్గా లేవని ఎద్దేవా చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ను చోటా రిచార్జ్‌తో పోల్చారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ పనిచేయడం లేదని ఆరోపించారు. కొత్తగా స్కూళ్లు నిర్మించలేదని, పరిభ్రత కూడా అంతంత మాత్రంగా ఉందని చెప్పారు.