Home » Face Pack
Beauty Tips: ఇంటిలో తక్కువ ఖర్చుతో సులభంగా తయారుచేసే సహజ (నేచురల్) ఫేస్ ప్యాకులు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి చర్మానికి నాటురల్ గ్లోని తెచ్చిపెడతాయి, పిగ్మెంటేషన్ ను తగ్గిస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పసుపు ఇది మచ్చలు, మొటిమలు, ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని మరియు అనేక చర్మ సమస్యలతో పోరాడుతుంది. చర్మ సమస్యలను తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు శనగపిండిలో సహజంగా మొటిమలను తొలగించే కొన్ని లక్షణాలు ఉన్నాయి.
పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండ చర్మం మీద దాడి చేయకుండా రక్షించడంతోపాటు మంటను తగ్గించే తేలికైన, సమర్థవంతమైన ఔషధం ఇది.
గుప్పెడు తాజా పుదీనా ఆకులను తీసుకోవాలి. దానికి కొద్దిగా నీరు, ఒక టేబుల్ స్పూన్ తేనెను చేర్చి మెత్తగా పేస్ట్ లా బ్లెండర్ లో వేసి తయారు చేసుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ ప్యాక్‌లా రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.