Face Pack : ముఖంపై మలినాలు తొలగించే పెరుగుతో ఫేస్ ప్యాక్

రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ నిమ్మరసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ ప్యాక్‌లా రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.

Face Pack : ముఖంపై మలినాలు తొలగించే పెరుగుతో ఫేస్ ప్యాక్

Curd

Updated On : October 31, 2021 / 11:23 AM IST

Face Pack : ముఖం పైన చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపించేందుకు వివిధ రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తుంటారు. ఇందుకోసం వివిధ రకాల క్రీములు ఉపయోగిస్తారు. అయితే సహజ సిద్ధంగా లభించే పెరుగును ఉపయోగించి ఫేస్ ఫ్యాక్ లు ట్రై చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. జిడ్డు, పొడిబారటం, మచ్చలతో కూడిన చర్మానికి పెరుగు మంచి సంరక్షణగా చెప్పవచ్చు.

1 టేబుల్ స్పూన్ పెరుగు, తేనె: 1/2 టేబుల్ స్పూన్. రెండింటినీ కలిపి ముఖం మీద రాయండి. 15 నిమిషాల తరువాత, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మానికి సహజమైన గ్లో ఇవ్వడానికి సహాయపడుతుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

పెరుగు 1 టేబుల్ స్పూన్, వేరుశెనగ పిండి: 1/2 స్పూన్, ఆరెంజ్ పీల్ పౌడర్ 1/4 స్పూన్. వీటన్నింటిని కలిపి పేస్ట్ గా చేయండి. ముఖాన్ని నీటితో శుభ్రంగా కడిగి ఆతరువాత ఆ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాయండి. 15-20 నిమిషాల తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

ఒక కప్పులో రెండు లేదా మూడు స్పూన్ల పుల్లని పెరుగు తీసుకొని బాగా గిలకొట్టాలి. ఇప్పుడు పెరుగును ముఖం, మెడ చుట్టూరా మర్దన చేస్తున్నట్టు రాసుకోవాలి. పుల్లని పెరుగు చర్మానికి పోషణనిస్త్తుంది. మలినాలు, మృతకణాలను తొలగించి చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది.

రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ నిమ్మరసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ ప్యాక్‌లా రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే ముఖం మీది దుమ్ము, మలినాలు తొలగి చర్మం తాజాగా, ఆరోగ్యంగా మారుతుంది.

రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, మాష్‌ చేసిన మగ్గిన అరటిపండు, రెండు టీ స్పూన్ల రోజ్‌వాటర్‌ను ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖం, మెడ చుట్టూ రాసుకోవాలి. కొద్దిసేపటి తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచుగా ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.