Beauty Tips: అమ్మాయిలు మీకోసం .. ఈ 5 ప్యాకులతో మెరిసే అందం మీసొంతం.. ఒకేసారి ట్రై చేయండి
Beauty Tips: ఇంటిలో తక్కువ ఖర్చుతో సులభంగా తయారుచేసే సహజ (నేచురల్) ఫేస్ ప్యాకులు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి చర్మానికి నాటురల్ గ్లోని తెచ్చిపెడతాయి, పిగ్మెంటేషన్ ను తగ్గిస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Glowing beauty with these 5 types of face packs
ప్రతి అమ్మాయి తన ముఖం, చర్మం మెరిసేలా, స్వచ్ఛంగా, అందంగా ఉండాలని కోరుకుంటుంది. ఇది చాలా సహజం. కానీ పెరుగుతున్న కాలుష్యం, దుమ్ము, ధూళి, హార్మోనల్ మార్పులు, జీవితశైలిలో వస్తున్న మార్పుల కారణంగా చర్మంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల మొటిమలు, మచ్చలు, చర్మం రంగు మారడం, డార్క్ స్పాట్స్ వంటి సమస్యలకు ఏర్పడతాయి. వీటి నివారణ కోసం అమ్మాయిలు చాలా కష్టపడతారు. క్రీములని, ఫేస్ ప్యాక్ లని ట్రై చేస్తూ ఉంటారు. అయితే, ఇలాంటి వాటికి మార్కెట్‌లో లభ్యమయ్యే కెమికల్ ఫేస్ ప్యాకుల కంటే, ఇంటిలో తక్కువ ఖర్చుతో సులభంగా తయారుచేసే సహజ (నేచురల్) ఫేస్ ప్యాకులు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి చర్మానికి నాటురల్ గ్లోని తెచ్చిపెడతాయి, పిగ్మెంటేషన్ ను తగ్గిస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి ఆ 5 ఫేస్ ప్యాకులు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
1.పెసరపిండి ఫేస్ ప్యాక్ (Glow & Brightening):
ఈ ప్యాక్ తయారుచేసుకోవడం చాలా సులభం. ముందుగా పెసరపిండి 2 టీస్పూన్లు, పసుపు చిటికెడు, పెరుగు 1 టీస్పూన్, తేనె 1 టీస్పూన్ తీసుకోవాలి. వాటిని బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మలినాలు తొలగిపోతాయి. చర్మం మెరుస్తుంది. నెమ్మదిగా పిగ్మెంటేషన్ తగ్గుతుంది.
2.మల్టాని మట్టి/గులాబీ తిలక ఫేస్ ప్యాక్ (Oil control + Acne care):
ఈ ప్యాక్ కోసం మల్టాని మట్టి 2 టీస్పూన్లు, రోజ్ వాటర్ టీ స్పూన్, తేనె 1 టీస్పూన్ తీసుకోవాలి. ఈ పదార్థాలను బాగా కలిపి ముద్దగా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం మొటిమలు తగ్గిపోతాయి. చర్మంపై ఆయిల్‌ను తీసేస్తుంది. చర్మానికి చల్లదనం శుభ్రతను ఇస్తుంది.
3.ఆల్మండ్/ పాపాయా ఫేస్ ప్యాక్ (Tan Removal + Nourishment):
పప్పు బాదం (ఆల్మండ్స్) 4 నుంచి 5, మెత్తబడిన పాపాయా 2 టీస్పూన్లు, పాలు సరిపడా తీసుకోవాలి. బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయం పప్పుగా చేసి, పాపాయాతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. డా పేస్ట్ ను ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇది సన్ టాన్‌ను తొలగిస్తుంది. చర్మానికి పోషణ ఇస్తుంది. మృదువైన, మెరిసే చర్మం అందిస్తుంది.
4.ఓట్స్/తేనె/ పెరుగు ఫేస్ ప్యాక్ (Exfoliation + Hydration):
ఈ ప్యాక్ కోసం ఓట్స్ పొడి 2 టీస్పూన్లు, పెరుగు 1 టీస్పూన్, తేనె 1 టీస్పూన్ తీసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేసి కాసేపు మెల్లగా మసాజ్ చేసుకోవాలి. అలా 15 నిమిషాలు చేసిన తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోతాయి. మాయిశ్చరైజింగ్ అవుతుంది. చర్మాన్ని సాఫ్ట్‌గా, గ్లోయింగ్‌గా ఉంచుతుంది.
5.టమోటా/ సెనగపిండి ఫేస్ ప్యాక్ (Pigmentation & Tan removal):
బెసన్ (సెనగపిండి) 2 టీస్పూన్లు, టమోటా రసం 1 టీస్పూన్, నిమ్మరసం కొంచం తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల పాటు ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ వారం లో రెండుసార్లు చేసుకోవచ్చు. దీనివల్ల చర్మాన్ని తెల్లబడుతుంది. టాన్ పోతుంది. మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
ఈ 5 ఫేస్ ప్యాకులు ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతో తయారుచేయబడినవి. వీటిని రెగ్యులర్‌గా వాడితే చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా మారుతుంది. అందుకే అమ్మాయిలూ.. మీ సహజ అందమే మీ అసలైన మెరుపు. ఈ నేచురల్ ఫేస్ ప్యాకులను వాడి, మీ అందాన్ని మరింత నిగారింపజేసుకోండి.