Home » Groundnut Cultivation :
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి.
ఖరీఫ్ లో వర్షాధారంగా వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం.

ముఖ్యంగా వేరుశనగ పంటలో తెగుళ్లు వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంట, వేసిన 25-30 రోజులకే మొక్కలు చనిపోతున్నాయి . ఈ పరిస్థితులను అధిగమించాలంటే విత్తనం వేసేముందు విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలి.
వరి మాగాణుల్లో లేదంటే కొత్తగా వేరు శనగ సాగు చేస్తుంటే కిలో విత్తనానికి 200గ్రా రైజోబియం కల్చరుని పట్టించాలి. విత్తనాన్ని మొదట శిలీంధ్రనాశినితో శుద్ధిచేసి, ఆరబెట్టిన తరువాత క్రిమి సంహారక మందుతో శుద్ధి చేయాలి. ఆతరువాత అవసరమైతే రైజోబియం కల్చర�