Home » Hyderabad Meteorological Department
హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని వెల్లడించింది. అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని తెలిపింది.
మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు చోట్ల 11 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట్ లో 158.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయింది.
వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. సెప్టెంబర్3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలోని 100కు పైగా ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 70కి పైగా ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 20కి పైగా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం అసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అ
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.