Heavy Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. సెప్టెంబర్3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Heavy Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Heavy Rains In Telangana

Heavy Rains In Telangana : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. సెప్టెంబర్3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

దీని ప్రభావంతో సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరిక

కాగా, శుక్రవారం రాత్రి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని తెలిపింది.

శనివారం, ఆదివారం, సోమవారం ఆదిలాబాల్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.