Home » Jammu and Kashmir
కేంద్ర పాలిత ప్రాంతంలోని అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధాలు కలిగి ఉన్న ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) మంగళవారం జమ్మూ, కాశ్మీర్లోని ఎనిమిది జిల్లాల్లో సోదాలు నిర్వహించింది.
జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ద్రాస్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటన ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు జమ్మూకశ్మీర్ లో ఆయన పర్యటిస్తారు. ఇవాళ ఉదయం ఆయన వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆయనతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత
జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్య గావించబడ్డారు. జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.
జమ్మూ-కాశ్మీర్లో జవాన్లపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒక పోలీసు మరణించగా, మరో సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించిన అనంతరం గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్థాపించిన పార్టీలో ‘ఏజ్ బార్’ ఉండదని, అనుభవజ్ఞులతో పాటు యువకులు పార్టీలో కలిసి పనిచేస్తారని చెప్పాడు.
భారత్తో సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 77వ సెషన్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
32ఏళ్ల తర్వాత కశ్మీర్లో సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఆదివారం మల్టీపర్సస్ సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘటన అని మనోజ్ సిన్హా అభివర్ణించారు.
జమ్మూలో వరుసగా రెండో రోజు బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం బస్సు లోయలో పడ్డ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అవినీతి పెరిగింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇస్తే కానీ పని జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కశ్మీరీ పండిట్లు తమ గొంతు వినిపించ