Jammu and Kashmir: జమ్మూలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి.. 12 మందికి గాయాలు

జమ్మూలో వరుసగా రెండో రోజు బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం బస్సు లోయలో పడ్డ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.

Jammu and Kashmir: జమ్మూలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి.. 12 మందికి గాయాలు

Updated On : September 15, 2022 / 3:28 PM IST

Jammu and Kashmir: జమ్మూలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం జమ్మూలోని పూంఛ్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగి 12 మంది మరణించిన ఘటన మరువక ముందే మరో బస్సు ప్రమాదం జరిగింది. రాజౌరి జిల్లాలో గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు.

Udupi Roads: పాడైన రోడ్లను బాగు చేయాలంటూ రోడ్లపై గుంతలకు హారతి, పొర్లు దండాలతో నిరసన

జమ్ము నుంచి సురాన్‌కోట్ పూంఛ్ వెళ్తున్న మినీ బస్సు మాంజకోట్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.