Udupi Roads: పాడైన రోడ్లను బాగు చేయాలంటూ రోడ్లపై గుంతలకు హారతి, పొర్లు దండాలతో నిరసన

రోడ్లు బాగోలేకపోతే వాటిని బాగు చేయాలని కోరుతూ కొందరు వినూత్నంగా నిరసన చేపడుతుంటారు. తాజాగా కర్ణాటకలోని ఉడుపిలో ఒక ఉద్యమకారుడు రోడ్లపై పొర్లు దండాలతో నిరసన చేపట్టాడు.

Udupi Roads: పాడైన రోడ్లను బాగు చేయాలంటూ రోడ్లపై గుంతలకు హారతి, పొర్లు దండాలతో నిరసన

Udupi Roads: రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక సామాజిక ఉద్యమ కారుడు వినూత్న నిరసన చేపట్టాడు. కర్ణాటకలోని ఉడుపిలో రోడ్లపై గుంతలకు హారతి ఇవ్వడమే కాకుండా, పొర్లు దండాలు కూడా పెట్టాడు.

Lakhimpur Kheri: మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అనంతరం వారి చున్నీలతోనే చెట్టుకు ఉరి

దీంతో ఈ నిరసనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కర్ణాటకలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎక్కడపడితే అక్కడ గుంతలు, బురద నీటితో నిండిపోయాయి. అందులోనూ ఉడుపిలోని రోడ్లు చాలా కాలంగా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు ఈ రోడ్లను పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్లు బాగు చేయాలని కోరుతూ నిత్యానంద వొలకాడు అనే సామాజిక ఉద్యమ కారుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు. స్థానిక ఇంద్రాలి బ్రిడ్జి దగ్గర రోడ్లపై ఉన్న గుంతలకు హారతి ఇచ్చాడు. తర్వాత అక్కడి బురద రోడ్లపై పొర్లు దండాలతో నిరసన చేపట్టాడు.

Rashmika Mandanna: ఆ చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా అయిన రష్మిక.. ప్లీజ్ ఒక్కసారి అంటూ వేడుకుంటోంది!

అక్కడి వాళ్లు ఈ నిరసనను వీడియో తీయగా, ప్రస్తుతం ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నిత్యానంద మాట్లాడుతూ ‘‘ఉడుపి-మణిపాల్ జాతీయ రహదారికి మూడేళ్ల క్రితమే టెండర్లు పిలిచినా ఇప్పటికీ రోడ్లను నిర్మించలేదు. సీఎం కూడా ఇదే రోడ్డుపై నుంచి ఎన్నోసార్లు వెళ్లారు. నిత్యం వేలాది మంది ఈ రోడ్లపై వెళ్తున్నప్పటికీ దీన్ని పట్టించుకోవడం లేదు. అందుకే రోడ్లు బాగు చేయాలి అని కోరుతూ ఈ నిరసన చేపట్టాను’’ అని అన్నారు.