Rashmika Mandanna: ఆ చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా అయిన రష్మిక.. ప్లీజ్ ఒక్కసారి అంటూ వేడుకుంటోంది!

నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది. ఈ బ్యూటీ నటించిన పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాత్ర అమ్మడికి మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ‘సామి.. సామి’ అంటూ రష్మిక వేసిన ఐకానిక్ స్టెప్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఓ చిన్నారి ఈ పాటకు వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rashmika Mandanna: ఆ చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా అయిన రష్మిక.. ప్లీజ్ ఒక్కసారి అంటూ వేడుకుంటోంది!

Rashmika Mandanna Impressed With Cute Baby Girl Video

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది. ఈ బ్యూటీ నటించిన పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాత్ర అమ్మడికి మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ అవగా, శ్రీవల్లి పాత్రలో రష్మిక పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో ‘సామి.. సామి’ అంటూ రష్మిక వేసిన ఐకానిక్ స్టెప్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Rashmika Mandanna : బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్‌లో ఓపెన్ డ్రెస్‌తో రష్మిక మందన్నా

పుష్ప చిత్రంలో రష్మిక డీగ్లామర్ పాత్ర చేసినా, తనదైన పర్ఫార్మెన్స్, డ్యాన్సులతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని సామి పాటకు రష్మిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. కాగా, తాజాగా ఓ చిన్నారి ఈ పాటకు వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బొద్దుగా ఉన్న చిన్నారి చాలా గ్రేస్‌తో వేసిన డ్యాన్స్ స్టెప్స్ అద్భుతంగా ఉండటంతో, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rashmika Mandanna: అమితాబ్ మాట వినని రష్మిక.. గుడ్‌బాయ్ అంటున్న బాలీవుడ్

ఇక ఈ వీడియోను చూసిన రష్మిక, తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఆ చిన్నారి డ్యాన్స్‌కు తాను కూడా ఫిదా అయ్యానని.. తనకు ఆ చిన్నారిని కలవాలనుందని తెలిపింది. ఎవరికైనా ఆ చిన్నారి అడ్రెస్ తెలిస్తే చెప్పాలంటూ వేడుకుంటుందో ఈ బ్యూటీ. మొత్తానికి తాను వేసిన డ్యాన్స్‌ను అద్భుతంగా ఇమిటేట్ చేసిన చిన్నారిపై రష్మిక మందన ప్రశంసలు కురిపించడంతో ఈ వీడియోను ఆమె అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.