Terrorist Attack: కాశ్మీర్‌లో తీవ్రవాద దాడి.. పోలీసు మృతి.. జవానుకు గాయాలు

జమ్మూ-కాశ్మీర్‌లో జవాన్లపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒక పోలీసు మరణించగా, మరో సీఆర్‌పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.

Terrorist Attack: కాశ్మీర్‌లో తీవ్రవాద దాడి.. పోలీసు మృతి.. జవానుకు గాయాలు

Updated On : October 2, 2022 / 6:03 PM IST

Terrorist Attack: జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక పోలీసు మరణించాడు. మరో జవానుకు గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జమ్మూ-కాశ్మీర్‌, పుల్వామా జిల్లా, పింగెలాన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జమ్మూ-కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు మరణించగా, మరో సీఆర్‌పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.

TRS Or BRS: టీఆర్ఎస్ కాదు.. ఇకపై బీఆర్ఎస్! దసరా రోజే ప్రకటన.. ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్

అనంతరం తీవ్రవాదులు అక్కడ్నుంచి పారిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న సైనికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి, ఏరియా మొత్తం గాలిస్తున్నారు. తీవ్రవాదులు పారిపోకుండా అన్నివైపులా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ జవాన్‌ను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా సైన్యం ఆధీనంలో ఉంది. తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.