TRS Or BRS: టీఆర్ఎస్ కాదు.. ఇకపై బీఆర్ఎస్! దసరా రోజే ప్రకటన.. ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారబోతుందా? కొత్త పార్టీని స్థాపించడం కంటే ఉన్న పార్టీ పేరు మారిస్తే చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకుంటున్నారా? పార్టీ ప్రకటన కోసం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారా?

TRS Or BRS: టీఆర్ఎస్ కాదు.. ఇకపై బీఆర్ఎస్! దసరా రోజే ప్రకటన.. ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్

TRS Or BRS: టీఆర్ఎస్ పార్టీ ఇకపై బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మారబోతుందా? ఔననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు కంటే.. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడమే మేలనే నిర్ణయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చినట్లు సమాచారం.

CM KCR New Party: దసరా రోజు మరోసారి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ.. ఆ రోజే కొత్త పార్టీపై ప్రకటన?

ఈ కొత్త పార్టీని ప్రకటించేందుకు కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజే కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దసరా రోజు మధ్యాహ్నం 01.19 నిమిషాలకు జాతీయ పార్టీని ప్రకటిస్తారని టీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, రేగా కాంతా రావు వెల్లడించారు. ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి కీలక విషయాల్ని సీఎం కేసీఆర్ వివరించినట్లు వారు చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి సత్యవతి రాథోడ్, రేగా కాంతా రావు పలు అంశాల్ని మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరుతో కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది. దసరా రోజు ఉదయం పార్టీకి చెందిన 283 మంది నేతలతో, తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో కొత్త పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం కేసీఆర్ పార్టీని ప్రకటిస్తారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. పేలుళ్లకు కుట్ర పన్నిన నిందితుడితోపాటు యువకుల అరెస్ట్

త్వరలో జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫునే తమ అభ్యర్థిని కేసీఆర్ బరిలోకి దింపబోతున్నారు. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే దేశంలో పోటీ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారినప్పటికీ, పార్టీకి కారు గుర్తే ఉంటుందని, దానివల్ల ప్రజల్లో ఇబ్బంది ఉండదని కేసీఆర్ చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు అంటే అనేక సమస్యలు వస్తాయని, దాని బదులు పార్టీ పేరు మారిస్తే సరిపోతుందని కేసీఆర్ అన్నారు. దసరా రోజు మంచి ముహూర్తం ఉండటంతో పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించబోతున్నారు. దేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు అవసరాన్ని కేసీఆర్ వివరించినట్లు పార్టీ నేతలు చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు, యువత అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు కొత్త జాతీయ పార్టీ అవసరమని కేసీఆర్ చెప్పినట్లు టీఆర్ఎస్ నేతలు వివరించారు.