Home » Jubilee Hills Rape Case
ఆరుగురు నిందితుల డీఎన్ఏ వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లతోపాటు, సాదుద్దీన్ డీఎన్ఏను కూడా పోలీసులు సేకరించాలి అనుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు.
బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు అన్నిరకాల అవకతవకలకు పాల్పడ్డారు. అత్యాచారం జరిగింది ప్రభుత్వ వాహనంలోనే అని గుర్తించడానికి పోలీసులకు ఎందుకు ఆలస్యమైంది? దోషులను తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసే విషయంలో టీఆర్ఎస్ పార్టీ చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కు రాజీనామా చేయాలని టీఆర్ఎస్ ఆదేశించింది. కానీ చైర్మన్ మసీవుల్లా మాత్రం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
నాలుగు రోజులపాటు సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తారు. చంచల్‌గూడ జైలు నుంచి నిందితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తాంచారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. తర్వాత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇప్పటివరకు నలుగురు అరెస్టుకాగా, మరో మైనర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.